Share News

చదువుతోపాటు సామాజిక సేవ అలవర్చుకోవాలి

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:46 PM

విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవ అలవర్చుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని అన్నారు. గౌరెడ్డిపేటలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆధ్వ ర్యంలో చేపడుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక శిబి రాన్ని సందర్శించారు.

చదువుతోపాటు సామాజిక సేవ అలవర్చుకోవాలి

పెద్దపల్లి రూరల్‌, సెప్టెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవ అలవర్చుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని అన్నారు. గౌరెడ్డిపేటలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆధ్వ ర్యంలో చేపడుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక శిబి రాన్ని సందర్శించారు. విద్యార్థులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు, గ్రామాల్లో చేపట్టిన సర్వే, స్వచ్ఛత తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణం గా విద్యార్థులు భవిష్యత్‌పై ఆలోచించాలని, మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశ నం చేసుకోవద్దని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి నరహరి, కార్యదర్శి తిరుపతి, అధ్యాపకులు ప్రసూన, శ్రీలత, పుష్పలత, అశోక్‌, కుమారస్వామి పాల్గొన్నారు.

గ్రామాల్లో స్వచ్ఛతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధి కారి కాళిందిని అన్నారు. స్వచ్ఛత హీ సేవలో భాగంగా గౌరెడ్డిపేటలో ర్యాలీలో ఆమె పాల్గొ న్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో మిత్ర సురక్ష శిబిరంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యదర్శి తిరు పతి, పల్లె దవాఖాన వైద్యురాలు సింధూష, మహిళ సంఘాల సిఏలు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 11:46 PM