అర్హులందరికీ ఓటరు నమోదు చేయాలి
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:06 AM
ప్రతీ ఉద్యోగి ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలని ఆర్డీవో గంగయ్య తెలిపారు. గురువారం తహసీల్దార్ రాజయ్య ఆధ్వర్యంలో బూత్ స్థాయి అధికారులకు, బిఎల్‌వోలకు, సూపర్‌వైజర్‌లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్ర మాన్ని నిర్వహించారు.
పెద్దపల్లి రూరల్, జూలై 3 (ఆంరఽధజ్యోతి): ప్రతీ ఉద్యోగి ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలని ఆర్డీవో గంగయ్య తెలిపారు. గురువారం తహసీల్దార్ రాజయ్య ఆధ్వర్యంలో బూత్ స్థాయి అధికారులకు, బిఎల్‌వోలకు, సూపర్‌వైజర్‌లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఆర్డీవో గంగయ్య మాట్లాడుతూ ఫారం -6, 7, 8ల ప్రాధాన్యతను వివరించారు. డిప్యూటీ తహసీల్దార్ విజేందర్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి): బీఎల్‌వోలు తమకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వహించాలని ఆరీ ్డవో సురేష్ అన్నారు. నాగారం రైతువేదికలో తహసీల్దార్ ముస్త్యాల వాసంతి ఆధ్వర్యంలో బీఎల్‌వోలకు శిక్షణను మాస్టర్ ట్రైనర్ మెరుగు రాజమౌళితో కలిసి నిర్వహిం చారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమో దు చేయాలని తెలిపారు. ఎవరైనా ఊరు విడిచి వెళ్లి పోయినా, మరణించినా పేర్లు తొలగించాలని పేర్కొ న్నారు. ఆర్‌ఐ స్రవంతి, సీనియర్ అసిస్టెంట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య బిఎల్‌ఓలను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల నియామవళిపై బీఎల్‌వోలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ జక్కని స్వర్ణ, మాస్టర్ ట్రేయినర్ రాజెందర్, ఆర్‌ఐ భవానిప్రసాద్ పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి):బీఎల్‌ఓలు తమకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వహించాలని ఆర్డీఓ గంగయ్య అన్నారు. బీఎల్‌ఓలకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఎవరైనా ఊరు విడిచి వెళ్లిపోయినా, మరణించినా వారి పేర్లు తొలగించాలన్నారు. తహసీ ల్దార్ బషీరొద్దిన్, అధికారులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, (ఆంధ్రజ్యోతి): ఎంపీడీవో కార్యాల యంలో బీఎల్‌ఓలకు ఓటరు నమోదుపై శిక్షణ కార్యక్ర మం చేపట్టారు. ఆర్డీఓ గంగయ్య మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునే విధానం తదితర అంశాలపై వివరించారు. తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.