Share News

దసరా సెలవు మార్చాలని ఏఐటీయూసీ ఆందోళనలు

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:53 PM

సింగరేణిలో దసరా పండుగ సెలవును అక్టో బరు 2కు బదులుగా 3వ తేదీకి మార్చాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐ టీయూసీ) సోమవారం సింగరేణిలో నిరసన లు తెలిపింది. బొగ్గు గనులు, డిపార్ట్‌మెంట్లు, ఓసీపీల్లో అధికారులకు వినతిపత్రాలు సమ ర్పించింది.

దసరా సెలవు మార్చాలని ఏఐటీయూసీ ఆందోళనలు

గోదావరిఖని, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో దసరా పండుగ సెలవును అక్టో బరు 2కు బదులుగా 3వ తేదీకి మార్చాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐ టీయూసీ) సోమవారం సింగరేణిలో నిరసన లు తెలిపింది. బొగ్గు గనులు, డిపార్ట్‌మెంట్లు, ఓసీపీల్లో అధికారులకు వినతిపత్రాలు సమ ర్పించింది. దసరా పండుగ మహాత్మాగాంధీ జయంతి అక్టోబరు 2న రావడంతో పండుగను కార్మికులు జరపుకునే పరిస్థితి లేదని నాయ కులు అధికారులకు తెలిపారు. పండుగ రోజు బొగ్గు గనులపై మైసమ్మ పూజలను చేస్తే ప్రమాదాలు జరుగవనే విశ్వాసం ఉంటుందని అధికారులకు తెలిపారు. అక్టోబరు 2న గాంధీ జయంతి కాకుండా 3న సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవుదినాన్ని ప్రకటించా లని నాయకులు మాదన మహేష్‌, రంగు శ్రీను, సిద్ధమల్ల రాజు డిమాండ్‌ చేశారు. ఆర్‌జీ-1 పరిధిలోని వివిధ గనులు, డిపార్ట్‌ మెంట్లపై జరిపిన నిరసన కార్యక్రమాల్లో ఏఐ టీయూసీ నాయకులు మల్లికార్జున్‌, సతీష్‌ బాబు, ప్రసాద్‌, శ్రీనివాస్‌, తిరుపతి, వెంకట య్య, వెంకన్న, అజీం పాషా, దాసరి శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, అనీల్‌, శ్రీరాములు పాల్గొన్నారు.

యైుటింక్లయిన్‌కాలనీ, (ఆంధ్ర జ్యోతి): అక్టో బరు 2న దసరా గాంధీ జయంతి వచ్చిన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని 3న పేయిడ్‌ హాలీడేగా మార్చాలని ఏఐటీయూసీ నాయకు లు ఆర్జీ-2 పరిధిలోని గనులు, డిపార్ట్‌ మెంట్లపై అధికారులకు వినతిపత్రా లను అందజేశారు. తెలంగాణలో పెద్ద పండుగ అయిన దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో మైస మ్మకు మొక్కులు చెల్లించుకునే అవకాశం లేకుండా పోయిందని నాయకులు తెలిపారు. ఎల్‌ ప్రకాష్‌, జిగురు రవీందర్‌, అన్నారావు, శ్యాంసన్‌, సాంబశివరావు, మహేందర్‌, సంప త్‌, మహేందర్‌, సంపత్‌, రాజు, నారాయణ, శంక ర్‌, రాజసాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 11:54 PM