ఏఐటీయూసీ ఆందోళనతోనే లాభాల వాటా ప్రకటన
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:46 PM
సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేసిన ఆందోళనల వల్లనే రాష్ట్ర ప్రభుత్వం లాభాల్లో వాటా ప్రకటన చేశారని, ప్రకటన విషయంలో యాజమాన్యం గుర్తింపు సంఘం తో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు.
గోదావరిఖని, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేసిన ఆందోళనల వల్లనే రాష్ట్ర ప్రభుత్వం లాభాల్లో వాటా ప్రకటన చేశారని, ప్రకటన విషయంలో యాజమాన్యం గుర్తింపు సంఘం తో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాజమాన్యం గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను చెప్పకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఏఐటీయూసీ ఈనెల 19న జీఎం కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించామన్నారు. యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది 34శాతం వాటా ప్రకటన చేశారని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యం సంస్థకు వచ్చిన లాభాలను గుర్తింపు సంఘంతో చర్చించకుండా ప్రకటన చేయించడాన్ని సోమవారం సింగరేణి భవన్‌లో జరిగిన సమావేశంలో వ్యతిరేకించామని పేర్కొన్నారు.
ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లాగౌడ్, వైవీ రావు, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కందుకూరి రాజారత్నం, నాయకులు జీగురు రవిందర్, గౌతం గోవర్ధన్, దాసరి శ్రీనివాస్, పెద్దెల్లి శంకర్, సంతోష్, అటికేటి రాజు, సమ్మి రెడ్డి, శంకర్ రావు, ఆకుల సురేష్, కీర్తి శేఖర్, రాజేందర్, తిరుపతి, వెంకటేష్, రాజయ్య, శ్రీకాంత్, పడాల కనకరాజు, గంగారపు చంద్రయ్య, ఆర్ రాజేశ్వరరావు, జే దేవయ్య, తాని రాజబాబు, కలవల జగన్నాథం పాల్గొన్నారు.