Share News

ఘనంగా ఏఐఎఫ్‌బీ ఆవిర్భావ వేడుకలు

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:42 PM

ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఆవిర్భావ వేడుకలు పెద్దపల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఏఐఎఫ్‌బి ఉమ్మడి కరీం నగర్‌ జిల్లా కార్యదర్శి బొంకూరి సురేందర్‌ సన్నీ మాట్లాడుతూ కులమత రహిత సమా జ నిర్మాణం, అంతరాలు లేని దృఢమైన భారతావని నిర్మాణమే లక్ష్యంగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆలోచనలో పార్టీ ఆవిర్భవించం దన్నారు.

ఘనంగా ఏఐఎఫ్‌బీ ఆవిర్భావ వేడుకలు

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఆవిర్భావ వేడుకలు పెద్దపల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఏఐఎఫ్‌బి ఉమ్మడి కరీం నగర్‌ జిల్లా కార్యదర్శి బొంకూరి సురేందర్‌ సన్నీ మాట్లాడుతూ కులమత రహిత సమా జ నిర్మాణం, అంతరాలు లేని దృఢమైన భారతావని నిర్మాణమే లక్ష్యంగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆలోచనలో పార్టీ ఆవిర్భవించం దన్నారు.

అన్నివర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేం దర్‌ రెడ్డి నాయకత్వంలో స్ధానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో అభ్యర్థులను నిలుపుతామన్నారు. నాయకురాలు పులిపాక అనూష, కళ్లేపల్లి రవి, కందుల మౌనిక ప్రశాంత్‌, బొంకూరి నవీన్‌, సింగారపు భవాని, పల్లె రాజేందర్‌, భూమయ్య, వినయ్‌, శ్యాం, జోగు అవినాష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:42 PM