పదేళ్ళ నిరీక్షణ అనంతరం రేషన్ కార్డుల అందజేత
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:20 AM
పదేళ్ళు ప్రజల నిరీక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం దారి చూపిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం ఆర్.కే గార్డెన్స్‌లో పెద్దపల్లి మండలం, పట్టణా నికి సంబంధించిన 480 మంది లబ్ధిదారులకు రేషన్‌కార్డులను జారీ చేసిన అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులను, ఇందిరమ్మ ఇండ్లను అందజేసినట్లు తెలిపారు.
పెద్దపల్లి టౌన్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): పదేళ్ళు ప్రజల నిరీక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం దారి చూపిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం ఆర్.కే గార్డెన్స్‌లో పెద్దపల్లి మండలం, పట్టణా నికి సంబంధించిన 480 మంది లబ్ధిదారులకు రేషన్‌కార్డులను జారీ చేసిన అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులను, ఇందిరమ్మ ఇండ్లను అందజేసినట్లు తెలిపారు. రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేసే బియ్యంపై పేద కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వారికి అన్యాయం చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వా నిదని స్పష్టం చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాం గ్రెస్ ప్రభుత్వానిది అని గుర్తు చేశారు. అలాగే 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల కు పెంచి పేద ప్రజల వైద్యానికి తోడ్పాటు అందిస్తున్నామన్నారు. పెద్దపల్లిలో బస్సు డిపో ఏర్పాటుకు సిద్ధం చేశామని వివరించారు. రైతుభరోసా ద్వారా రైతన్నల ఖాతాల్లో పెట్టు బడి సాయం జమ చేశామని, రైతులు పం డించిన ధాన్యం అకాల వర్షాలతో తడిసినప్ప టికీ ఒక గింజ కటింగ్‌లేకుండా కొనుగోలు చేసి 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేశా మని, సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చామన్నారు. దివ్యాంగులకు చేయూతగా ఆర్థిక పునరావాసం కింద రాష్ట ప్రభుత్వం అం దిస్తున్న రాయితీను ఏడుగురు లబ్ధిదారులకు 3 లక్షల 37 వేల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ రాజ య్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి, నూగుల్ల మల్లయ్య, అరె సంతోష్, కడర్ల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ నర్సింహా రెడ్డి, సంపత్, సుధాకర్‌రెడ్డి, ఏడల్లి శంకర్, కలబోయిన మహేందర్, పాల్గొన్నారు.