Share News

నిరంతర తాగునీటి సరఫరాకు కార్యాచరణ చేపట్టాలి

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:12 AM

పట్టణంలో రోజు తాగునీటి సరఫరా చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మున్సిపల్‌ అధికారులకు సూచించారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాల యంలో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో 30 రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు.

నిరంతర తాగునీటి సరఫరాకు కార్యాచరణ చేపట్టాలి

పెద్దపల్లిటౌన్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) పట్టణంలో రోజు తాగునీటి సరఫరా చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మున్సిపల్‌ అధికారులకు సూచించారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాల యంలో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో 30 రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిత్యం తాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల న్నారు.

నల్ల నీరు వృథాగా వదిలే వారి కనెక్షన్‌ తీసివేయాలని, కొత్త విద్యుత్‌ స్తంభాలు, లైట్లు ఏర్పాటు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఓపెన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండకుండా చూడాలని సూచించారు. నిత్యం ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయాలని, రెండు నెలల్లో పూర్తి స్థాయిలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. బహిరంగంగా రోడ్డు పై చెత్త వేసే వారికి భారీ జరిమానాలు విధించాలని కలెక్టర్‌ ఆదేశించారు. రోజు పట్టణంలో ఫాగ్గింగ్‌ చేయాలని, వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాటు చేయా లని, మండపాల సమీపంలో పరిశుభ్రత పాటించేందుకు చర్యలు చేపట్టా లని ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌, ఏఈ సతీష్‌ అధికా రులు, పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2025 | 12:12 AM