నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను పూర్తిచేయాలి
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:30 AM
నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను పూర్తి చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం అన్నారు. గురువారం సీఎండీతో పాటు డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్‌వీ సూర్యనారా యణ, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కేవెం కటేశ్వర్లు పర్యటించారు. జీడీకే 11ఇంక్లైన్, ఓసీ పీ-5లో పర్యటించి ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు.

గోదావరిఖని, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను పూర్తి చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం అన్నారు. గురువారం సీఎండీతో పాటు డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్‌వీ సూర్యనారా యణ, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కేవెం కటేశ్వర్లు పర్యటించారు. జీడీకే 11ఇంక్లైన్, ఓసీ పీ-5లో పర్యటించి ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగు లకు కేటాయించిన విధులను ఎనిమిది గంటల సమయంలో పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని, భారీ యంత్రాల వినియోగం సమయాన్ని పెం చాలన్నారు. వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వారికి కావలసిన సౌక ర్యాలను తెలుసుకున్నారు. వివిధ రకాల యం త్రాలు, విడిభాగాలు పాతవైనా పనులు వెళ్లదీస్తు న్నామని, వాటి స్థానంలో నూతన యంత్రాలు ప్రవేశపెట్టాలని సీఎండీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎండీ త్వరలోనే విచారణ చేసి వీటికి సంబంధించిన పనులను త్వరగా చేయా లని అధికారులను ఆదేశించారు.
ఈ ఆర్థిక సంవ త్సరం నిర్దేశించిన 72మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ప్రతీ ఒక్కరు రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకత దిశగా పని చేయాలని సూచించారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్ర మంలో ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్‌కుమార్, రక్షణ జీఎం కేహెచ్‌ఎన్ గుప్త, క్వాలిటీ జీఎం డీ బైద్య, ఏజంట్ చిలుక శ్రీనివాస్, ఓసీపీ-5 ప్రాజెక్టు ఆఫీసర్ చంద్రశేఖర్, ఏసీఎంఓ కిరణ్ రాజ్ కుమార్, డీజీఎం (పర్సనల్) కిరణ్ బాబు, అధికారులు డీవీరావు, అంజనేయ ప్రసాద్, ఆంజనేయులు, వరప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, మేనేజర్లు రమేష్ బాబు అనిల్ గబాలే, బీ మల్లేష్, నాయకులు, స్వామి, మడ్డి ఎల్లయ్య, అరెల్లి పోషం, సీనియర్ పీఓ హన్మంతరావు, పాల్గొన్నారు.