Share News

అభివృద్ధి చూడలేకనే ఎమ్మెల్యేపై ఆరోపణలు

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:10 AM

రామ గుండంలో వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్‌, నాయకుడు కౌశిక హరి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌, మహంకాళి స్వామి అన్నారు

అభివృద్ధి చూడలేకనే ఎమ్మెల్యేపై  ఆరోపణలు

గోదావరిఖని, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రామ గుండంలో వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్‌, నాయకుడు కౌశిక హరి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌, మహంకాళి స్వామి అన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండంలో జెన్‌కో స్థానంలో ఎమ్మెల్యే 800మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను తీసుకువస్తే తాము 13సంవత్సరాల క్రితమే 1320మెగావాట్ల విద్యుత్‌ప్లాంట్‌ను తీసుకువచ్చామం టూ వారు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రామగుండంకు 800మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను ఎమ్మెల్యే తీసుకు వస్తే జీర్ణించుకోలేక పోతున్నార న్నారు. రామగుండంలో గడిచిన ఐదేళ్లలో కమీషన్ల పాలన ఎవరు కొనసాగించారో ప్రజలకు తెలుసునని, బూడిద, ఇసుక, మట్టి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉద్యోగాల్లో కోట్ల రూపాయలు దండుకున్నారని, ప్రభుత్వాసుపత్రిలో ఒక్కొక్కరికి రూ.3లక్షలు, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో రూ.15లక్షలు, మున్సిపాలిటీలో రూ.4లక్షలు వసూలు చేసింది మాజీ ఎమ్మెల్యే కాదా అని వారు ప్రశ్నించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల పేరిట ముగ్గురి చావుకు కారణమైన బీఆర్‌ఎస్‌ నాయకులను ప్రజలే తరిమికొడతారన్నారు. రామగుండం అభివృద్ధికి రూ.800 కోట్ల నిధులను ఎమ్మెల్యే మక్కాన్‌ి సంగ్‌ రాజ్‌ఠాకూర్‌ తీసుకువచ్చారని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ దీపాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తు న్నారన్నారు. నాయకులు కాల్వ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్‌, ముస్తఫా, గట్ల రమేష్‌, మిడిదొడ్డి ప్రవీణ్‌, వసంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:10 AM