అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:14 AM
రామగుండం లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. గురువారం రామగుండం కార్పొరేషన్‌లో ఆయన విస్తృత పర్యటన చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాం గణంలో జరుగుతున్న పనులు, శ్మశానవాటిక, అశోక్‌న గర్‌లోని గర్ల్స్ హైస్కూల్, గౌతమినగర్‌లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రామగుండంలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు.
కోల్‌సిటీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రామగుండం లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. గురువారం రామగుండం కార్పొరేషన్‌లో ఆయన విస్తృత పర్యటన చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాం గణంలో జరుగుతున్న పనులు, శ్మశానవాటిక, అశోక్‌న గర్‌లోని గర్ల్స్ హైస్కూల్, గౌతమినగర్‌లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రామగుండంలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. సమ్మక్క - సార లమ్మ జాతర పనులను వేగంగా చేయాలని, నాణ్యతతో కూడిన పనులు చేస్తూ, త్వరితగతిన పూర్తి చేసి జాతర సమయానికి అందుబాటులోకి తీసుకురావడానికి సింగ రేణితో సమన్వయం చేస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు.
గోదావరినది ఒడ్డున ఉన్న స్మశాన వాటిక అభివృద్ధి కోసం డీపీఆర్ తయారు చేయాలని, అశోక్‌నగ ర్‌లోని గర్ల్స్ హై స్కూల్ అభివృద్ధి కోసం రూ.1కోటి మం జూరు చేయడం జరిగిందని, డిజైన్ ప్రకారం అభివృద్ధి పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ సం బంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గౌతమి నగర్ వద్ద చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన ఆయన పనులను వేగంగా చేయాలని, బీ పవర్‌హౌస్ నుంచి రామగుండం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎస్‌ఈ గురువీర్, ఈఈ రామన్, సింగరేణి శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు.