Share News

అబ్దుల్‌ కలాం సేవలు మరువలేనివి

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:44 PM

దేశానికి అబ్దుల్‌ కలాం చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్‌ నాయకులు బాల రాజ్‌కుమార్‌, పాతిపెల్లి ఎల్లయ్య అన్నారు. ఆదివారం అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని అబ్దుల్‌ కలాం విగ్రహా నికి క్షీరాభిషేకం చేశారు.

అబ్దుల్‌ కలాం సేవలు మరువలేనివి

కళ్యాణ్‌నగర్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): దేశానికి అబ్దుల్‌ కలాం చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్‌ నాయకులు బాల రాజ్‌కుమార్‌, పాతిపెల్లి ఎల్లయ్య అన్నారు. ఆదివారం అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని అబ్దుల్‌ కలాం విగ్రహా నికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా దేశానికి సేవలందించారన్నారు. అబ్దుల్‌ కలాం ప్రపంచా నికి ఆదర్శంగా నిలిచారన్నారు. జ్యోతి, ప్రభంజన్‌, సాగర్‌, రాకేష్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.

ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఆదివా రం మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వర్ధంతిని కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు దుగ్యాల సంతోష్‌ రావు, కోరుకంటి వెంక టేశ్వర్‌ రావు, తాటిపల్లి రమేష్‌ బాబు, నరహరి సుధాకర్‌ రెడ్డి, అర్షనపల్లి వెంకటేశ్వర్‌ రావు, పర్శరా ములు గౌడ్‌, గొల్లె భూమేష్‌, రాంచంద్ర రెడ్డి పాల్గొన్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వర్ధంతిని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన నివాసంలో ఆదివారం నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఏగోళపు శంకర్‌గౌడ్‌, కనవేన శ్రీనివాస్‌, వంశీ, తిరుపతిలు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:44 PM