Share News

రేజంగ్ల రజ్‌ కలశ యాత్రకు ఘన స్వాగతం

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:56 PM

పెద్దపల్లి పట్టణానికి చేరు కున్న రేజంగ్ల రజ్‌ కలశ యాత్రకు అఖిల భారత యాదవ మహాసభ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సందనవేన రాజేందర్‌, తమ్మడబోయిన ఓదెలు యాదవ్‌ ఆధ్వర్యంలో సోమవారం స్వాగతం పలికారు.

రేజంగ్ల రజ్‌ కలశ యాత్రకు ఘన స్వాగతం

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణానికి చేరు కున్న రేజంగ్ల రజ్‌ కలశ యాత్రకు అఖిల భారత యాదవ మహాసభ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సందనవేన రాజేందర్‌, తమ్మడబోయిన ఓదెలు యాదవ్‌ ఆధ్వర్యంలో సోమవారం స్వాగతం పలికారు. కమాన్‌ నుంచి జండా చౌరస్తా వరకు యాత్ర కొనసాగించారు. నల్గొండ జిల్లాకు చెందిన సైనికుడు జక్కుల శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన యాత్రను ఉద్దేశించి మాజీ సైనికుడు మేకల విజయ్‌ కుమార్‌ యాత్ర విశేషాలను వివరించారు. చైనా, భారత్‌ యుద్ధంలో అమరులైన యాదవ సైనికుల మట్టి కలశం యాత్ర సాగుతున్నదన్నారు. స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చిలా రపు పర్వతాలు యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌, రాజం మహంత కృష్ణ, అట్ల సాగర్‌ యాదవ్‌, నాగరాజు యాదవ్‌, పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): చైనా, భారత్‌ యుద్ధంలో అమరులైన యాదవ సైనికుల మట్టి కలశం యాత్ర గోదావరిఖనికి చేరుకోగా మున్సి పల్‌ టీ జంక్షన్‌ వద్ద పాతపెల్లి రవియాదవ్‌ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మెండె లింగయ్య, బోయిని మల్లేష్‌, పోషం, ఆర్‌కే, కుమార్‌, చుక్కల శ్రీనివాస్‌, రాజన్న, రేడియం శ్రీను, రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 11:56 PM