Share News

త్వరలో గ్రంథాలయానికి పక్కా భవనం

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:37 AM

ధర్మారంలో గ్రంథాలయానికి త్వర లో పక్కా భవన నిర్మాణం చేపడుతామని జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మ న్‌ అంతటి అన్నయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో లైబ్రేరి యన్‌ నాగభూషణం, ఏఎంసీ చైర్మెన్‌ రూప్లానాయక్‌లతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.

త్వరలో గ్రంథాలయానికి పక్కా భవనం

ధర్మారం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ధర్మారంలో గ్రంథాలయానికి త్వర లో పక్కా భవన నిర్మాణం చేపడుతామని జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మ న్‌ అంతటి అన్నయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో లైబ్రేరి యన్‌ నాగభూషణం, ఏఎంసీ చైర్మెన్‌ రూప్లానాయక్‌లతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ విప్‌ సహకారంతో గ్రంథాలయానికి భవన నిర్మా ణం చేపడుతామని తెలిపారు. అనంతరం గెస్ట్‌హౌజ్‌లో నిర్వహిస్తున్న గ్రంథాలయాన్ని పరిశీలించారు. మినరల్‌ వాటర్‌, కూలర్‌ ఏర్పాటు చేయిం చి ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించారు. రెండు రోజుల్లో అవసరమైన కుర్చీ లు, టేబుల్లు, ఫ్యాన్లను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ లింగయ్య, పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, నాయకులు పాలకుర్తి రాజేశం, దేవి జనార్దన్‌, కాంపెల్లి రాజేశం, పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:37 AM