Share News

జోరుగా పల్లెపోరు

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:53 AM

పల్లె ఎన్నికలు జోరందుకున్నాయి. సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో ఐదు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం ముగిసి పోయింది. ఉపసంహారణలు, ఏకగ్రీవాల కోసం ఒకవైపు మంతనాలు జరుగుతుండగా మరోవైపు ప్రచారంలోకి అభ్య ర్థులు ఆడుగుపెడుతున్నారు.

జోరుగా పల్లెపోరు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పల్లె ఎన్నికలు జోరందుకున్నాయి. సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో ఐదు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం ముగిసి పోయింది. ఉపసంహారణలు, ఏకగ్రీవాల కోసం ఒకవైపు మంతనాలు జరుగుతుండగా మరోవైపు ప్రచారంలోకి అభ్య ర్థులు ఆడుగుపెడుతున్నారు. రెండవ విడతలో బోయి న్‌పల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 88 గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేసి నవంబరు 30 నుంచి డిసెంబరు 2వ తేదీ నామినేషన్లు స్వీకరించనున్నారు. 3న పరిశీలన, 6 న ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. 14న పోలింగ్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 27 క్లస్టర్ల ద్వారా నామినేషన్ల స్వీకరణకు సిద్ధం చేశారు. ఇల్లంతకుంటలో 11 కేంద్రాలు, బోయిన్‌పల్లిలో 6 కేంద్రా లు, తంగళ్లపల్లిలో 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండ వ విడతలో మూడు మండలాల్లో 88 సర్పంచ్‌లు, 758 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగనున్నాయి. బోయి న్‌పల్లి మండలంలో 23 సర్పంచ్‌లు, 212 వార్డులు ఉండ గా, ఇల్లంతకుంట మండలంలో 35 సర్పంచ్‌లు, 294 వార్డులు ఉన్నాయి. తంగళ్లపల్లిలో 30 సర్పంచ్‌లు, 252 వార్డులు ఉన్నాయి.

రెండవ విడతలో రిజర్వేషన్లు

జిల్లాలో 260 సర్పంచ్‌లు 2,268 వార్డులు ఉండగా రెండవ విడతలో నాలుగు మండలాల్లో 88 సర్పంచ్‌లు, 758 వార్డు సభ్యులకు నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారు. 84 సర్పంచ్‌ల్లో రిజర్వేషన్లలో బోయిన్‌పల్లి మండలంలో 23 సర్పంచ్‌ స్థానాల్లో 11 మహిళలకు, 12 జనరల్‌కు కేటాయించారు. ఇందులో ఎస్టీ రిజర్వ్‌ లేవు. ఎస్సీలకు 6 స్థానాలు ఉండగా 3 మహిళలకు, 3 జనరల్‌, బీసీలకు 5 స్థానాలు ఉండగా 2 మహిళలకు,3 జనరల్‌కు కేటాయించారు. జనరల్‌కు 12 స్థానాలు ఉండగా 6 మహి ళలకు, 6 జనరల్‌ ఉన్నాయి. ఇల్లంతకుంట మండలంలో 35 సర్పంచ్‌ల్లో 17 మహిళలకు 18 జన రల్‌కు కేటాయించారు. ఎస్టీలకు స్థానాలు కేటా యించలేదు. ఎస్సీలకు 8 స్థానాలు ఉండగా 4 మహి ళలు, 4 జనరల్‌, బీసీలకు 9 స్థానాలు ఉండగా మహి ళలకు 4, జనరల్‌ 5, కేటాయించారు. 18 జనరల్‌ స్థానాల్లో 9 మహిళలకు 9 జనరల్‌ ఉన్నాయి. తంగ ళ్లపల్లి మండలంలో 30 సర్పంచ్‌ల్లో 14 మహిళలు, 16 జనరల్‌ ఉన్నాయి. ఇందులో ఎస్టీలకు స్థానాలు లేవు ఎస్సీలకు 6 స్థానాలు ఉండగా 3 మహిళలు, 3 జనరల్‌కు ఉన్నాయి. బీసీలకు 9 కేటాయించగా 4 మహిళలు, 5 జనరల్‌ ఉన్నాయి. 15 జనరల్‌ స్థానాల్లో 7 మహిళలు, 8 జనరల్‌ ఉన్నాయి.758 వార్డుల్లో రిజర్వేషన్లలో 319 మహిళలకు, 439 జనరల్‌కు కేటా యించారు. బోయిన్‌పల్లి మండలంలో 212 వార్డు స్థానా ల్లో 92మహిళలకు, 120 జనరల్‌కు కేటాయించారు. ఇందులో ఎస్టీ రిజర్వ్‌ లేవు. ఎస్సీలకు 56 స్థానాలు ఉండగా 23 మహిళలకు, 33 జనరల్‌, బీసీలకు 50 స్థానాలు ఉండగా 20 మహిళలకు,30 జనరల్‌కు కేటా యించారు. జనరల్‌కు 106 స్థానాలు ఉండగా 49 మహి ళలకు, 57 జనరల్‌ ఉన్నాయి. ఇల్లంతకుంట మండ లంలో 294 వార్డులు ఉండగా 122 మహిళలకు,172 జనరల్‌ కేటాయించారు. ఎస్టీలకు స్థానాలు కేటా యించలేదు. ఎస్సీలకు 62 స్థానాలు ఉండగా 24 మహిళలు, 38 జనరల్‌, బీసీలకు 85 స్థానాలు ఉండగా మహిళలకు 34, జనరల్‌ 51, కేటాయించారు. 147 జనరల్‌ స్థానాల్లో 64 మహిళలకు 83 జనరల్‌ ఉన్నాయి. తంగళ్లపల్లి మండలంలో 252 వార్డుల్లో 105 మహిళలు, 147 జనరల్‌ ఉన్నాయి. ఇందులో ఎస్టీలకు స్థానాలు లేవు. ఎస్సీలకు 50 స్థానాలు ఉండగా 18 మహిళలు, 32 జనరల్‌కు ఉన్నాయి. బీసీలకు 76 కేటాయించగా 34 మహిళలు, 51 జనరల్‌ ఉన్నాయి. 147 జనరల్‌ స్థానాల్లో 122 మహిళలు, 172 జనరల్‌ ఉన్నాయి.

రెండవ విడతలో 1,11,129 మంది ఓటర్లు

జిల్లాలో 3,53,351 మంది ఓటర్లు ఉండగా మొదటి విడత ఎన్నికల్లో 1,14,282 మంది ఓటు హక్కు విని యోగించుకోనుండగా రెండవ విడతలో 1,11,129 మంది ఓటు వేయనున్నారు. ఇందులో 53,792 మంది పురు షులు ఉండగా 57,337 మంది మహిళలు ఉన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:53 AM