Share News

చెక్‌డ్యాంలపై సమగ్ర విచారణ జరపాలి

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:17 AM

జిల్లాలోని మానేరు నదిపై గత ప్రభుత్వ హయాంలో డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన చెక్‌డ్యాంలు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరపాలని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సభ్యులు శశిభూషణ్‌ కాచె, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్‌, కలెక్టర్‌ను కోరారు.

చెక్‌డ్యాంలపై సమగ్ర విచారణ జరపాలి

పెద్దపల్లి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మానేరు నదిపై గత ప్రభుత్వ హయాంలో డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన చెక్‌డ్యాంలు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరపాలని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సభ్యులు శశిభూషణ్‌ కాచె, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్‌, కలెక్టర్‌ను కోరారు. శనివారం వారు కలెక్టర్‌ కోయ శ్రీహర్షను కలిసి వినతి పత్రం అందజేశారు. మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాములు కూలిపోవడంపై అధికారులు, కాంట్రాక్టర్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు.

కొందరు మాజీ ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని రాజకీయ కోణంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. నీటి పారుదల శాఖాధికారులు అపోహలు సృష్టించే విధంగా ప్రకటనలు ఇస్తుండడంతో రైతులు ఆత్మస్థయిర్యాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన చెక్‌డ్యాంలు అనతి కాలంలోనే కూలిపోవడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు మంథని సత్యం, ఎరుకల ప్రవీణ్‌ కుమార్‌, ఆరెల్లి కిరణ్‌, ఊదరి శంకర్‌, గుమ్మడి సమ్మయ్య, తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:17 AM