Share News

ఆర్‌జీ-1లో 110శాతం బొగ్గు ఉత్పత్తి

ABN , Publish Date - Sep 30 , 2025 | 10:57 PM

ఆర్‌జీ-1లో సెప్టెంబ రులో 2.85లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికిగాను 3.13లక్షల టన్నుల ఉత్పత్తితో 110శాతం లక్ష్యాన్ని సాధించినట్టు ఆర్‌జీ-1 జీఎం లలిత్‌ కుమార్‌ చెప్పారు. మంగళవారం జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఆర్‌జీ-1లో 110శాతం బొగ్గు ఉత్పత్తి

గోదావరిఖని, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆర్‌జీ-1లో సెప్టెంబ రులో 2.85లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికిగాను 3.13లక్షల టన్నుల ఉత్పత్తితో 110శాతం లక్ష్యాన్ని సాధించినట్టు ఆర్‌జీ-1 జీఎం లలిత్‌ కుమార్‌ చెప్పారు. మంగళవారం జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీడీకే1, 3ఇంక్లైన్‌ 16వేల టన్నులకుగాను 10వేల టన్నులు, జీడీకే 2, 2ఏ ఇంక్లైన్‌ 19వేల టన్నులకు 12వేల టన్నులు, జీడీకే 11ఇంక్లైన్‌ 67వేల టన్నులకు 42వేల టన్నులు, జీడీకే ఓసీపీ 1.82లక్షల టన్నులకు 2.48లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు తెలిపారు.

భారీ వర్షాల దృష్ట్యా ఈనెల 2న జవహర్‌లాల్‌ నెహ్రూ సేడియంలో జరిగే దసరా ఉత్సవాలను వాయిదా వేసినట్టు చెప్పారు. విలేకరుల సమా వేశంలో ఎస్‌ఓటూ జీఎం రమేష్‌, ఏరియా ఇంజనీర్‌ రాంమోహన్‌ రావు, పర్సనల్‌ మేనేజర్‌ రవీందర్‌రెడ్డి, ఐఈడీ ఎస్‌ఈ రాజన్న, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ హన్మంతరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 10:57 PM