Share News

Telangana Caste Issues: సీఎం రమేశ్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందించాలి

ABN , Publish Date - Aug 01 , 2025 | 03:34 AM

కమ్మ సామాజిక వర్గాన్ని అవమాన పరిచేలా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారంటూ..

Telangana Caste Issues: సీఎం రమేశ్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందించాలి

  • కమ్మ సంఘాల సమాఖ్య డిమాండ్‌

యూసు్‌ఫగూడ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కమ్మ సామాజిక వర్గాన్ని అవమాన పరిచేలా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారంటూ.. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ చేసిన ప్రకటనపై కేటీఆర్‌ స్పందించాలని తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్య ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆయన నిజంగానే వ్యాఖ్యలు చేశారని భావించాల్సి ఉంటుందని అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాఖ్య సభ్యులు శంకర్‌రావు, సుబ్బారావు, ఉప్పలపాటి రాణి తదితరులు మాట్లాడారు. సీఎం రమేశ్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఇప్పటికీ వివరణ ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. కేసీఆర్‌ పాలనలో తమ వర్గానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారని వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో 25 లక్షల మంది కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నారని, రాబోయే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ’’మా ఓట్లు మీకు అవసరం లేదా ?.’’ అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు. సీఎం రమేశ్‌ చేసిన ప్రకటన అబద్ధమైతే కేటీఆర్‌ వెంటనే ఖండించాలని, లేదంటే తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని సమాఖ్య నాయకులు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 03:34 AM