Share News

DSC 2024: పొరపాటున ఉద్యోగం ఇచ్చాం

ABN , Publish Date - Aug 05 , 2025 | 04:28 AM

జిల్లా విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం.. ఒకరికి శాపమైంది. డీఎస్సీ 2024లో హిందీ పండిట్‌ విభాగంలో 35 పోస్టులను భర్తీ చేశారు.

DSC 2024: పొరపాటున ఉద్యోగం ఇచ్చాం

  • 9 నెలలు పనిచేశాక టీచర్‌ తొలగింపు

  • విద్యాశాఖ మరో తప్పిదం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం.. ఒకరికి శాపమైంది. డీఎస్సీ 2024లో హిందీ పండిట్‌ విభాగంలో 35 పోస్టులను భర్తీ చేశారు. బీసీ-డీ కేటగిరీలో ఒక పోస్టుకు 58.30 మార్కుల(53 ర్యాంకు)తో ఒక మహిళ, 52 మార్కులు (72వ ర్యాంకు)తో ఒక పురుషుడిని 1:3 కింద ఎంపిక చేశారు. 58.30 మార్కులు సాధించిన మహిళను స్థానికత (లోకల్‌ కేటగిరీ) రంగారెడ్డి జిల్లా లో ఉందని పక్కకు పెట్టి, తర్వాత 52 మార్కులొచ్చిన హైదరాబాద్‌ జిల్లా జియాగూడ వాసి (పురుషుడు)కి ఉద్యోగం ఇచ్చారు. దీంతో ఆయన 2024 అక్టోబర్‌ 10న ఆసి్‌ఫనగర్‌ మండలం గోషాకట్‌ స్కూల్‌లో 9 నెలలుగా ఉద్యోగం చేస్తున్నారు. కాగా, గత జూలై 29న ఆ హిందీ పండిట్‌కు ఫోన్‌ చేసిన హైదరాబాద్‌ డీఈఓ కార్యాల య అధికారులు ఎక్కువ మార్కులు సాధించిన మహి ళ హైదరాబాద్‌ లోకల్‌ కిందకే వస్తున్నట్లు తమకు ఆధారాలు చూపారని చెప్పారు.


హైకోర్టు తీర్పు మేరకు విధుల నుంచి తొలగిస్తున్నామని, ఆఫీ్‌సకొచ్చి ఆర్డర్‌ కాపీపై సంతకం చేసి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ఆయన అప్పటి నుంచి షాక్‌లో ఉన్నారు. డీఈఓ కార్యాలయం నుంచి ఆర్డర్‌ కాపీ తీసుకోకుండా ఇంటివద్దే ఉంటున్నారు. అధికారుల తప్పిదంతో తనను బలిచేసి, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించి కుటుంబాన్ని రోడ్డుపాలు చేయొద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Updated Date - Aug 05 , 2025 | 04:28 AM