Share News

JNTU: జేఎన్టీయూ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Aug 08 , 2025 | 04:34 AM

జేఎన్టీయూ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. బీఫార్మసీ, ఎంబీఏ, ఎంటెక్‌ కోర్సుల్లో 50 శాతానికిపైగా, బీటెక్‌లో 44.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

JNTU: జేఎన్టీయూ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’ ఫలితాలు విడుదల

  • ఎంఫార్మసీ, ఎంబీఏలో 68 శాతం..

  • బీటెక్‌లో 44శాతం, ఎంటెక్‌లో 25 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జేఎన్టీయూ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. బీఫార్మసీ, ఎంబీఏ, ఎంటెక్‌ కోర్సుల్లో 50 శాతానికిపైగా, బీటెక్‌లో 44.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎంటెక్‌, ఎంసీఏ, బీటెక్‌(సీసీసీ) కోర్సుల్లో ఉత్తీర్ణత 20 శాతం నుంచి 36శాతంలోపే ఉంది. వర్సిటీ అఫిలియేటెడ్‌ కళాశాలల్లో పదేళ్ల క్రితం యూజీ, పీజీ కోర్సులు చదివిన అభ్యర్థుల్లో బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులను క్లియర్‌ చేసుకోని వారికోసం వన్‌టైమ్‌చాన్స్‌ పేరిట జేఎన్‌టీయూ గత ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ జారీ చే సింది. మే/జూన్‌ నెలల్లో నిర్వహించిన పరీక్షలకు 7 కోర్సుల్లో 2,083 సబ్జెక్టు(థియరీ, ప్రాక్టికల్‌ కలిపి 21,059) పరీక్షలకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో 20,825 థియరీ పరీక్షలకు 15,618 మందే హాజరయ్యారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు 234 మందికి 178 మంది హాజరయ్యారు. 186 మంది విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి.

వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత ఇలా..

కోర్సు హాజరు ఉత్తీర్ణత శాతం

బీటెక్‌ 11,566 5,129 44.35

బీఫార్మసీ 1,281 701 54.72

ఎంబీఏ 1,812 1,243 68.60

ఎంఫార్మసీ 316 216 68.35

ఎంసీఏ 34 12 35.29

ఎంటెక్‌ 310 79 25.48

బీటెక్‌ (సీసీసీ) 480 98 20.42


ఈ వార్తలు కూడా చదవండి..

గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్

తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు

Updated Date - Aug 08 , 2025 | 04:34 AM