Jaggareddy: ఏడాదిలో 300 రివ్యూలు చేసిన సీఎం రేవంత్
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:40 AM
ప్రజల్ని మోసం చేయడంలో దిట్ట అయిన కేసీఆర్‌కు.. మోసగాళ్లకు మోసగాడంటూ కాంగ్రెస్ పార్టీ నామకరణం చేస్తోందన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కొట్టుడు కాదని, తామే ఆయనకు దట్టి కొడతామన్నారు.
పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్.. సెక్రెటేరియట్‌కు వచ్చి 3 రివ్యూలైనా చేశాడా?
ప్రజల్ని మోసం చేయడంలో ఆయన దిట్ట
అందుకే కేసీఆర్ మోసగాళ్లకు మోసగాడు
ప్రజలను ఎలా మోసం చేయాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు
నువ్వు కాంగ్రె్‌సను కొట్టుడు కాదు.. మేమే నీకు దట్టి కొడతాం
కేసీఆర్.. ఐదు లక్షల మందితో సభ పెడితే..
5 లక్షల ఒక వేయి మందితో నేనూ సభ పెడతా
బంగారం కోసం మహిళలు అమ్ముడు పోయారంటారా?
కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: జగ్గారెడ్డి
హైదరాబాద్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ‘‘ సీఎం రేవంత్‌రెడ్డి.. ఏడాది కాలంలో రాష్ట్ర అభివృద్ధిపై సచివాలయంలో 300 రివ్యూలు చేశారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్.. సచివాలయానికి వచ్చి మూడు రివ్యూలైనా చేశాడా?’’ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రజల్ని మోసం చేయడంలో దిట్ట అయిన కేసీఆర్‌కు.. మోసగాళ్లకు మోసగాడంటూ కాంగ్రెస్ పార్టీ నామకరణం చేస్తోందన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కొట్టుడు కాదని, తామే ఆయనకు దట్టి కొడతామన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదంటూ కేసీఆర్ మాట్లాడుతున్నడని, కానీ.. ఆయనకు మాటల్లో ఉన్న బలం చేతల్లో ఉండదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కోపం వచ్చి ఉఫ్ అంటే.. కేసీఆర్ గాలికి కొట్టుకుపోతాడన్నారు. ‘‘ప్రజాసమస్యలపై చర్చ కోసం అసెంబ్లీని పెట్టమని సీఎంను ప్రతిపక్ష నేత అడుగుతడు. కానీ ఇక్క రివర్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డే.. కేసీఆర్‌ను సభకు రావాలని అడుగుతున్నడు. అయినా ఆయన రావట్లేదు.’’
అని విమర్శించారు. తులం బంగారానికి ఆశపడి అమ్ముడు పోయారంటూ మహిళలను అవమానించిన కేసీఆర్.. వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్కటి కూడా కరెక్టుగా మాట్లాడరని, అన్నీ బక్వాస్ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. జనాన్ని ఎలా మోసం చేయాలని ఫామ్ హౌస్‌లో రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాడన్నారు. ఎన్నికలకు ముందే రాష్ట్ర ఖజానాను కేసీఆర్ సంకనాకించాడని, రియల్ వ్యాపారాన్నీ నాశనం చేశాడన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేనాటికి వివిధ పనులకు సంబంధించి రూ. లక్ష కోట్ల బిల్లులను కేసీఆర్ పెండింగ్‌లో పెట్టి వెళ్లాడన్నారు. ఆయన చేసిన రూ. 7 లక్షల కోట్ల అప్పులకు.. ఏడాదికి రూ. 50 వేల కోట్ల చొప్పున సీఎం రేవంత్‌రెడ్డి.. వాయుదాలు కట్టాల్సి వస్తోందన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన కేసీఆర్.. ప్రజల బతుకును బజారు పాలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ 5 లక్షల మందితో సభ పెడితే.. తాము 5 లక్షల ఒక వేయి మందితో పెడతామన్నారు. రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ చెబితే తానే ఆ సభ పెడతానన్నారు. ఐదు లక్షల మందితో సభ పెట్టి కేసీఆర్..మొనగాడు అనిపించుకోవాలని, ఆయన కంటే ఎక్కువ మందితో సభ పెట్టి మొనగాళ్లకు మొనగాళ్లమని తాము అనిపించుకుంటామని సవాలు విసిరారు.