Jagga Reddy Daughter Wedding : వైభవంగా జగ్గారెడ్డి కుమార్తె వివాహం
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:36 AM
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల దంపతుల కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఘనంగా జరిగింది.
వధూవరులు జయారెడ్డి-గుణ చైతన్యరెడ్డిని ఆశీర్వదించిన మంత్రులు, ప్రముఖులు
సంగారెడ్డి, ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల దంపతుల కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఘనంగా జరిగింది. సంగారెడ్డిలోని రాంమందిర్ వేదికగా గురువారం రాత్రి జరిగిన వేడుకకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత, కుమార్తె నైమిషారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీనియర్ నేతలు కేవీపీ రామచందర్‌రావు, వి.హనుమంతరావు, షబ్బీర్‌అలీ, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు, జగ్గారెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు