Share News

Jagga Reddy: ఎమ్మెల్యేలను ప్రభుత్వం.. ఓడినోళ్లను పార్టీ.. విశ్వాసంలోకి తీసుకోవాలి

ABN , Publish Date - Feb 04 , 2025 | 05:17 AM

అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. పాలనతో పాటు ఎమ్మెల్యేలకూ ప్రాధాన్యమిచ్చి చూసుకోవాల్సి ఉంటుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

Jagga Reddy: ఎమ్మెల్యేలను ప్రభుత్వం.. ఓడినోళ్లను పార్టీ.. విశ్వాసంలోకి తీసుకోవాలి

ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యమివ్వాలి

  • మా సర్కారులో మంత్రులకు స్వేచ్ఛ ఎక్కువ

  • ఇంపార్టెంట్‌ అయితేనే సీఎం జోక్యం

  • రాహుల్‌ చెప్పిన తర్వాత నేను అంతర్గత విషయాలు మాట్లాడట్లే

  • కొన్ని విషయాలు షేర్‌ చేయలేను

  • సమయం వచ్చినప్పుడు మాట్లాడతా

  • ప్రభుత్వం బద్నాం కావద్దు.. పార్టీ ఇబ్బంది పడొద్దు

  • మాకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది

  • అధికార పార్టీ ఎమ్మెల్యేల భేటీపై జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. పాలనతో పాటు ఎమ్మెల్యేలకూ ప్రాధాన్యమిచ్చి చూసుకోవాల్సి ఉంటుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలను ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకుంటే.. ఓడిన వారిని పార్టీ నాయకత్వం చూసుకోవాలని చెప్పారు. గాంధీభవన్‌లో సోమవారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు మీటింగ్‌ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే కొన్ని విషయాలను తాను ఇప్పుడే షేర్‌ చేయలేనని అన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పారు. పరిస్థితి చూస్తే ఇబ్బందిగా అనిపించినా తాను బయటికి చెప్పలేనన్నారు. పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడొద్దంటూ రాహుల్‌ గాంధీ చెప్పినప్పటి నుంచీ తాను మాట్లాడడం లేదని తెలిపారు.


సహజంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, ఇంపార్టెంట్‌ అయితేనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లున్నారన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలాంటి ఇబ్బందులు తప్పవని చెప్పారు. ఇలాంటి వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రొటోకాల్‌ పరిధిలో తాను లేనన్నారు. పార్టీ పరిధిలో తనకు ప్రొటోకాల్‌ ఉన్నా.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీలకు సలహాలు ఇచ్చే ప్రొటోకాల్‌లో తాను లేనని చెప్పారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా చిన్న, చిన్న సమస్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. తమకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉందన్నారు. ప్రభుత్వం బద్నాం కావద్దని, పార్టీ ఇబ్బంది పడొద్దని అన్నారు.


ఇవి కూడా చదవండి..

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 05:17 AM