Share News

Jagga Reddy: ఇందిరమ్మ అంటేనే రోటీ.. కపడా.. మకాన్‌!

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:06 AM

ఇందిరమ్మ అంటేనే ఎవరికైనా గుర్తుకు వచ్చేది.. రోటీ, కపడా, మకాన్‌ అని టీపీసీసీ అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశంలో.. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఆమె ఇచ్చిన ఇల్లు, ఇంటి జాగా ఇప్పటికీ కనిపిస్తాయని చెప్పారు.

Jagga Reddy: ఇందిరమ్మ అంటేనే రోటీ.. కపడా.. మకాన్‌!

  • ఏ గ్రామం వెళ్లినా ఆమె ఇచ్చిన ఇల్లు.. ఇంటి జాగా కనిపిస్తుంది

  • పాకిస్థాన్‌ సైన్యాన్ని తరిమికొట్టి బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం తెచ్చిన ఘనత ఆమెదే

  • ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసు

  • బండి సంజయ్‌కి తెలియకపోవడం దురదృష్టకరం

  • వాజ్‌పేయి, ఆడ్వాణీల గురించి తప్పుగా మాట్లాడామా?

  • కాంగ్రె్‌సకు క్షమాపణ చెప్పి తప్పు సరిదిద్దుకో

  • బండి సంజయ్‌కి తూర్పు జగ్గారెడ్డి హితవు

హైదరాబాద్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ అంటేనే ఎవరికైనా గుర్తుకు వచ్చేది.. రోటీ, కపడా, మకాన్‌ అని టీపీసీసీ అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశంలో.. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఆమె ఇచ్చిన ఇల్లు, ఇంటి జాగా ఇప్పటికీ కనిపిస్తాయని చెప్పారు. మనం పుట్టకముందే ఆమె ప్రతి ఊర్లోనూ పేదలకు ఇల్లు, ఇంటి జాగా ఇచ్చారని, ఆమె చరిత్ర ఏం తెలుసునని బండి సంజయ్‌ మాట్లాడుతున్నారని నిలదీశారు. ‘‘నీ పార్లమెంటు నియోజకవర్గంలో ఏ ఊరికైనా వెళదాం. అక్కడ ఆమె ఇచ్చిన ఇల్లు ఉంటుంది. వచ్చే ధైర్యం నీకుందా?’’ అని బండి సంజయ్‌కి సవాల్‌ విసిరారు. ఇందిరమ్మకు, కాంగ్రెస్‌ పార్టీకి క్షమాపణలు చెప్పి చేసిన తప్పును సరిద్దుకోవాలని హితవు పలికారు. గాంధీభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 80ఏళ్ల వయసున్న ఏ అవ్వా, తాతను అడిగినా ఇందిరాగాంధీ చరిత్ర ఏంటన్నది చెబుతారన్నారు. ఆమె ఆరేళ్ల పాటు జైలు జీవితం గడిపారని తెలిపారు. రాజీవ్‌గాంధీ.. ఆమె జైల్లో ఉన్నప్పుడే పుట్టారన్నారు. పాకిస్థాన్‌ సైన్యాన్ని తరిమికొట్టి బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్ర ఇచ్చిన చరిత్ర ఇందిరమ్మదని చెప్పారు. ఈ చరిత్ర తెలియని బండి సంజయ్‌.. ఇందిరమ్మను గురించి మాట్లాడి నవ్వుల పాలు కావద్దన్నారు. తాము ఎప్పుడైనా వాజ్‌పేయి, ఆడ్వాణీల గురించి తప్పుగా మాట్లాడామా? అంటూ నిలదీశారు. ‘‘ఇందిరాగాంధీ.. బండి సంజయ్‌కైనా, నాకైనా జేజమ్మ. ఇందిరమ్మ గురించి సంజయ్‌ మాట్లాడటం.. జేజమ్మకు దగ్గు నేర్పినట్లుగా ఉంది’’ అని ఎద్దేవా చేశారు.


బండి సంజయ్‌ అమ్మ కూడా ఇందిరమ్మ అభిమానేనేమో!

‘‘చిన్నతనంలో నేను ఆర్‌ఎ్‌సఎస్‌ శాఖకు వెళ్లే వాడిని. అయితే మా అమ్మ, నాన్న ఇందిరమ్మకు, కాంగ్రెస్‌కు అభిమానులు. నాకు పదేళ్ల వయసున్నప్పుడు ఇందిర సంగారెడ్డికి వచ్చారు. ఆమె వచ్చిందని తెలియగానే తెల్లవారుజామున 3 గంటల సమయంలో మా అమ్మ నన్ను సంకలో వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఇంకా నాకు గుర్తుంది’’ అంటూ వివరించారు. ఇందిరమ్మ అంటే బండి సంజయ్‌ తల్లికీ అభిమానం ఉండి ఉండొచ్చునన్నారు. మోదీ, అమిత్‌షాల కుటుంబ సభ్యు లు కూడా ఆనాడు ఇందిరమ్మ అభిమానులే అయుండొచ్చునన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 04:06 AM