Share News

Hyderabad: నాలుగేళ్లుగా చెట్టుకిందే అమ్మవార్లు..

ABN , Publish Date - May 21 , 2025 | 09:51 AM

నగరంలోని ముసారాంబాగ్‌ డివిజన్‌లోగల దుర్గమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ అమ్మవార్ల విగ్రహాలు నేటికీ చెట్టకిందనే ఉండిపోయాయి. ఆలయాల పునర్నిర్మాణ పనులు గత నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైనా నేటికీ పూర్తికాలేదు. దీంతో అమ్మవార్ల విగ్రహాలు చెట్లకిందనే పూజలందుకుంటున్నాయి.

Hyderabad: నాలుగేళ్లుగా చెట్టుకిందే అమ్మవార్లు..

- పూర్తికాని దుర్గమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఆలయల పునర్నిర్మాణం

- పూజలు చేసేందుకు వాంబేకాలనీవాసుల ఇబ్బందులు

హైదరాబాద్: ముసారాంబాగ్‌ డివిజన్‌(Musarambagh Division)లోని శాలివాహననగర్‌లో గల వాంబే కాలనీలో ఉన్న దుర్గమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఆలయాల పునర్నిర్మాణ కోసం చేపట్టిన పనులు నాలుగేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. కనీసం వాంబే కాలనీవాసులు అమ్మవార్లకు పూజలు చేసుకోడానికి వీలు లేకుండా గుంతలు తవ్వి వదిలేశారు. దీంతో అమ్మవార్ల ప్రతిమలను చెట్టు కిందే ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కనీసం పూజలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి


వాంబే కాలనీలో దాదాపు 110 కుటుంబాలు నివాసముంటున్నాయి. కాలనీవాసుల అభీష్టం మేరకు వాంబే కాలనీలోని ఖాళీ స్థలంలో దుర్గమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఆలయాలు నిర్మించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ముసారాంబాగ్‌ కార్పొరేటర్‌గా ఎన్నికైన బొక్క భాగ్యలక్ష్మీరెడ్డి వాంబే కాలనీలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు భూమి పూజలు నిర్వహించారు. అనంతరం నిర్మాణ పనులు చేపట్టేందుకు గుంతలు తవ్వారు. అంతే... అక్కడి నుంచి ఇంతవరకు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికీ ఈ ఆలయాల వద్ద గుంతలను పూడ్చలేక, పనులు చేయించడానికి స్థానికులకు స్తోమత లేక అమ్మవార్ల ప్రతిమలను చెట్టుకిందే ప్రతిష్ఠించారు.


city4.2.jpg

ప్రతి సంవత్సరం ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు, దసరా పండుగల సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునే వాంబే కాలనీ వాసులు కనీసం పూజలు చేసుకోడానికి వీలులేని పరి స్థితి ఏర్పండి. పలుమార్లు కార్పొరేటర్‌ భాగ్యలక్ష్మీరెడ్డిని కలిసి అమ్మవారి దేవాలయాల పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరితే వాటిని చేపట్టకుండా పెండింగ్‌లో పెడుతున్నారని వాంబే కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.


కార్పొరేటర్‌ ఇంటిని ముట్టడిస్తాం

వచ్చే ఆషాఢ మాసంలో జరగనున్న బోనాల ఉత్సవాల నాటికి వాంబే కాలనీలోని దుర్గమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ దేవాలయాల పునర్నిర్మాణపనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. లేదంటే వాంబే కాలనీవాసులతో కలిసి ముసారాంబాగ్‌ కార్పొరేటర్‌ బొక్క భాగ్యలక్ష్మీరెడ్డి ఇంటిని ముట్టడిస్తాం.

- చిట్టుపాక ప్రభాకర్‌ మాదిగ, మాదిగ రాజకీయ పోరాట సమితి

తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు


ఆలయ నిర్మాణానికి తాము సిద్ధమే

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం వాస్తవమే. అయితే, స్థానికులు ఎమ్మెల్యే ద్వారా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పడంతో ఆలయ నిర్మాణం ముందుకు సాగలేదు. ఇప్పటికైనా స్థానికులు సహకరిస్తే ఆలయ నిర్మాణానికి తాము సిద్ధమే.

- బొక్క భాగ్యలక్ష్మీరెడ్డి, కార్పొరేటర్‌


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

నల్లమల సంపదపై రేవంత్‌ కన్ను: బీఆర్‌ఎస్‌

BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..

Adilabad MP Nagesh: పటాన్‌చెరు- ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణ పనులు చేపట్టాలి

గోవుల అక్రమ రవాణా

Read Latest Telangana News and National News

Updated Date - May 21 , 2025 | 09:51 AM