IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీకి 7వ స్థానం!
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:01 AM
దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల జాబితాలో హైదరాబాద్ ఐఐటీ 7వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. అలాగే ఓవరాల్ కేటగిరీలోనూ 12వ ర్యాంకు సాధించింది.
అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో సత్తా.. ‘ఓవరాల్’లో 12వ ర్యాంకు
రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల జాబితాలో ఓయూకు ఏడో స్థానం.. ‘ఓవరాల్’ 53
ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ-2025 ర్యాంకింగ్స్ వెల్లడి
న్యూఢిల్లీ/హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల జాబితాలో హైదరాబాద్ ఐఐటీ 7వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. అలాగే ఓవరాల్ కేటగిరీలోనూ 12వ ర్యాంకు సాధించింది. అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల జాబితాలో వరుసగా పదోసారి.. ఓవరాల్ కేటగిరీలో వరుసగా ఏడోసారి ఐఐటీ మద్రాస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ) ఆధారంగా రూపొందించిన వివిధ రంగాల్లోని అత్యున్నత విద్యాసంస్థలతో కూడిన నివేదికను ‘ఇండియా ర్యాంకింగ్స్ 2025’ పేరిట కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ గురువారం విడుదల చేశారు. ఓవరాల్ కేటగిరీలో దేశంలోని టాప్ 100 విద్యాసంస్థల్లో 24 రాష్ట్ర ప్రభుత్వ విశ్వ విద్యాలయాలు, 22 ప్రైవేటు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, 19 ఐఐటీలు, ఐఐఎస్సీలు, 9 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 8 నిట్ సంస్థలు, 5 వైద్య సంస్థలున్నాయి. అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నిట్ వరంగల్ 28, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 35, ఐఐఐటీ హైదరాబాద్ 38, ఐఐటీ తిరుపతి 57వ స్థానంలో నిలిచింది. ఓవరాల్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాల నుంచి హెచ్‌సీయూ 26, ఆంధ్రా యూనివర్సిటీ 41, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 46, ఉస్మానియా యూనివర్సిటీ 53, నిట్ వరంగల్ 63, ఐఐఐటీ హైదరాబాద్ 89వ స్థానాల్లో నిలిచాయి.
రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల విభాగంలో..
రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విభాగంలో జాదవ్‌పూర్ యూనివర్సిటీ (కోల్‌కతా) మొదటి స్థానంలో నిలవగా, ఆంరఽధా విశ్వవిద్యాలయం(విశాఖపట్నం) 4, ఉస్మానియా విశ్వవిద్యాలయం (హైదరాబాద్) 7వ స్థానంలో ఉంది. విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన హెచ్‌సీయూ 18, ఆంరఽధా యూనివర్సిటీ 23, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 26, ఉస్మానియా యూనివర్సిటీ 30, జేఎన్‌టీయూ (హైదరాబాద్) 81వ స్థానంలో నిలిచాయి. ఇక న్యాయ విద్య విభాగంలో నల్సార్ యూనివర్సిటీ 3, ఫార్మసీలో నైపర్ (హైదరాబాద్) 5, వ్యవసాయ విద్యలో జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 24, వైద్య విద్యలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ 48వ ర్యాంకు సాధించింది. మేనేజ్‌మెంట్ విద్యలో ఐఐఎం అహ్మదాబాద్, వైద్య విద్యలో ఎయిమ్స్ ఢిల్లీ, న్యాయవిద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ అగ్రస్థానంలో నిలిచాయి.
ఈ వార్తలు కూడా చదవండి
సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం
Read Latest TG News and National News