Share News

Hyderabad News: దంపతుల గొడవ.. నచ్చజెప్పబోయిన మహిళపై దారుణం

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:09 PM

Hyderabad News: దంపతుల మధ్య గొడవను ఆపేందుకు వెళ్లిన మహిళపై దారుణం జరిగింది. మైలర్‌దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Hyderabad News: దంపతుల గొడవ.. నచ్చజెప్పబోయిన మహిళపై దారుణం
Hyderabad News

హైదరాబాద్, జూన్ 7: భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరగడం కామన్. అవి సరదా గొడవలు అయితే పర్వాలేదు. కానీ చిలికి చిలికి గాలివానగా మారితేనే కష్టం. దంపతులు గొడవపడే సమయంలో ఎవ్వరూ తలదూర్చకపోవడమే ఉత్తమం. ఇద్దరు మాటామాటా అనుకోవడం.. ఆ తరువాత కలిసిపోవడం కామన్. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన గురించి తెలిస్తే.. వామ్మో భార్య భర్తల మధ్య గొడవల్లో అస్సలు తలదూర్చొద్దు అని అనుకోకుండా ఉండలేరు. దంపతులు ఒకరిని ఒకరు దూషించుకుంటుంటే అయ్యో పాపం అని వెళ్లిన ఓ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. విషయం తెలిసిన ప్రతీఒక్కరూ మంచికి పోతే చెడు ఎదురవ్వం అంటే ఇదేనేమో అంటూ వాపోతున్నారు.


నగరంలోని మైలార్‌దేవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి మధుబన్ కాలనీలో దారుణం జరిగింది. కాలనీలో నివాసం ఉండే సలీం, అతన భార్య మధ్య ఓ విషయంలో ఘర్షణ చెలరేగింది. అది అంతకంతకూ పెరుగుతూ ఉంటడటంతో అక్కడే ఉన్న జుబేదా అనే మహిళ వారికి సర్ధిచెప్పేందుకు వెళ్లింది. ఇదే ఆమె పాలిట శాపంగా మారింది. దంపతులకు నచ్చజెప్పేందుకు వెళ్లిన మహిళ పట్ల సదరు భర్త విచక్షణ మరిచి ప్రవర్తించాడు. దీంతో ఆమె ఆస్పత్రిపాలైంది.


గొడవను నిలువరించేందుకు వెళ్లిన జుబేదా బేగం అనే మహిళపై కత్తితో దాడి చేశాడు సలీం. గొడవలకు పోకుండా కూర్చుని మాట్లాడుకోండి అంటూ దంపతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది మహిళ. దీంతో ఆగ్రహానికి గురైన సలీం ఆమెపై కత్తితో విచాక్షణారహితంగా దాడి చేశాడు. మాకే నీతులు చెబుతావా అంటూ కోపోద్రిక్తుడయ్యాడు. సలీం దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన అక్కడి స్థానికులను అవాక్కయ్యేలా చేసింది. దంపతులకు మంచి చేయాలని చూస్తే ఇలా దాడి చేస్తారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఏపీకి గూగుల్.. స్థలం పరిశీలన పూర్తి

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 12:59 PM