Share News

Telangana Wine Shop: కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే

ABN , Publish Date - Sep 25 , 2025 | 02:45 PM

అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితిగా నిర్ణయించారు.

Telangana Wine Shop: కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే
Telangana Wine Shop

హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు (Telangana Wine Shop) నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి (శుక్రవారం) నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితిగా నిర్ణయించారు. అలాగే టెండర్ ఫీజును రూ.3 లక్షలుగా నిర్ణయించారు. గతంలో టెండర్ ఫీజు రూ.2లక్షలు ఉండగా.. ఇప్పుడు ఒక లక్ష అదనంగా పెంచుతూ మూడు లక్షలుగా తేల్చారు. అలాగే ఫీజు మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఆరు విడతలుగా చెల్లించే వెసులుబాటు కల్పించారు.


ఇక ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు నవంబర్‌ 30తో ముగియనుంది. అలాగే ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు మద్యం దుకాణాలు పొందడానికి అనర్హులుగా పరిగణించబడతారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి.


ఇవి కూడా చదవండి..

నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి

లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కొడుకు అరెస్ట్..ఇక తర్వాత..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 03:18 PM