TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాక్..
ABN , Publish Date - Oct 04 , 2025 | 08:32 PM
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు పెంచుతున్నట్లు పేర్కొంది.
హైదరాబాద్: టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. సిటీ బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు పేర్కొంది.
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎస్ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో ఛార్జీల పెంచుతున్నట్లు చెప్పింది. మొదటి మూడు స్టేజిలకు రూ.5, 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు ఛార్జీల వసూలు చేయనున్నట్లు సమాచారం. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. అయితే.. పెరిగిన ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
తాజాగా ఛార్జీల పెంపుపై టీజీఎస్‌ఆర్టీసీ స్పందించింది. ఆర్థిక భారాన్ని మోయలేకపోతున్నామని తేల్చి చెప్పింది. సిటీ బస్సుల్లో మెరుగైన వసతులు కల్పించాలంటే ఛార్జీలు పెంచక తప్పట్లేదు అని వివరించింది. పెరిగిన ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. సిటీ బస్సుల్లో పెరిగిన ఛార్జీలపై నగరవాసులు సహకరించాలని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ