Share News

TPCC: మంత్రి పదవి కోరలేదు.. సీఎంతో గ్యాప్ లేదు: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

ABN , Publish Date - Nov 12 , 2025 | 03:25 PM

తనకు, ముఖ్యమంత్రికి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులతో తనకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఓట్ల చోరీ తెలంగాణలోనూ జరిగిందని..

TPCC:  మంత్రి పదవి కోరలేదు.. సీఎంతో గ్యాప్ లేదు:  టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
TPCC Chief Mahesh Goud

సీఎం రేవంత్ రెడ్డి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టతనిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను చాలా సంతోషంగా ఉన్నానని, మంత్రి పదవి కావాలని తాను ఎక్కడ అడగడం లేదని కూడా ఆయన వివరణ ఇచ్చారు.


' పార్టీ లో నేను ఆర్గనైజషన్ నుంచి వచ్చాను. పార్టీ అప్పగించే బాధ్యతను నిర్వర్తిస్తాను. నేను మంత్రి వర్గంలోకి వెళ్లాలని ఆరాటపడటం లేదు. నాకు సీఎంతో పాటు మంత్రివర్గం మొత్తం పూర్తిగా సహకారం అందిస్తున్నారు. నాకు, సీఎంకు ఎలాంటి గ్యాప్ లేదు'. అని మహేష్ గౌడ్ చెప్పారు.


తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగిందన్న మహేష్ గౌడ్.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి ఎక్కువ సీట్లు గెలిచిందన్నారు. నిజామాబాద్‌లో ఓటు చోరీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఓల్డ్ సిటీలో ఆధారాలను ఫిరోజ్ ఖాన్ బయట పెట్టాడని, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తుందనుకోవడం లేదని కూడా టీపీసీసీ చీఫ్ చెప్పారు.


'ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉంది. దానం నాగేందర్ మా పార్టీ విధానాలు నచ్చి మాతో ప్రయాణిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కెసిఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో ఆ పార్టీ నేతలే చెప్పాలి. ఇంపార్టెంట్ వ్యక్తులకు కెసిఆర్ ఫోన్ లు చేసినట్లు మాకు సమాచారం ఉంది. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం దురదృష్టకరం. ఢిల్లీలో బాంబ్ బ్లాస్టింగ్, కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యమని ఆయన అన్నారు.


ఇవీ చదవండి:

మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..


మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..

Updated Date - Nov 12 , 2025 | 03:37 PM