Share News

TG News: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. కీలక నేత మృతి..

ABN , Publish Date - Jan 18 , 2025 | 08:53 PM

తెలంగాణ (Telangana) మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 16న(గురవారం) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం (Chhattisgarh) బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్-మారేడుబాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (Bade Chokka Rao ) అలియాస్ దామోదర్ మృతిచెందారు.

TG News: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. కీలక నేత మృతి..
Chhattisgarh Encounter

హైదరాబాద్: తెలంగాణ (Telangana) మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 16న(గురవారం) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం (Chhattisgarh) బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్-మారేడుబాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (Bade Chokka Rao) అలియాస్ దామోదర్ మృతిచెందారు. రెండ్రోజుల క్రితం మావోలు, భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో చొక్కారావుతోపాటు 18 మంది నక్సల్స్ మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.

Mohan Babu: ట్విస్ట్‌ ఇచ్చిన మోహన్ బాబు.. మనోజ్ స్పందన ఏంటో


ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు.. మావో సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. 30 ఏళ్లుగా ఆయన నక్సల్ ఉద్యమంలో వివిధ హోదాల్లో పని చేశారు. కరోనాతో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ మృతిచెందగా.. కేంద్ర కమిటీ బడే చొక్కారావుకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఎన్నో ఏళ్లుగా పలు రాష్ట్రాలకు ఆయన మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చొక్కారావుపై రూ.50 లక్షల రివార్డు ప్రకటించగా.. తెలంగాణ రాష్ట్రం సైతం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. కాగా, ప్రస్తుతం ఎదురుకాల్పుల్లో ఆయన మృతిచెందారు. చొక్కారావు భార్య రజితను సైతం 2023లో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

Formula E Case: ఫార్ములా ఈ కేసు.. ఏసీబీ ముందుకు ఆ కంపెనీ ప్రతినిధులు

Manchu Manoj: మంచు ఫ్యామిలీ పంచాయితీ.. ఆ అధికారితో మనోజ్ కీలక భేటీ

Updated Date - Jan 18 , 2025 | 10:25 PM