Telangana local Body Elections: ఎన్నికల సంఘం సంచలన ప్రకటన.. ఎన్నికలు నిలివేత..
ABN , Publish Date - Oct 09 , 2025 | 09:40 PM
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 29న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికల ప్రక్రియ ఆపేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
అయితే ఇవాళ (గురువారం) బీసీ రిజర్వేషన్లపై రెండో రోజు విచారణ చేపట్టిన హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 9పై స్టే విధించిన విషయం తెలిసిందే. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా స్టే ఇస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. మరోపక్క హైకోర్టు స్టేపై బీసీ సంఘాల నాయకులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమ నోటికాడ ముద్ద లాక్కున్నారని ఆరోపిస్తూ.. హైకోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించపోతే.. తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తామని బీసీ సంఘాలు హెచ్చరించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కుప్పకూలిన పోలీస్ అధికారి.. అసలేమైందంటే..
రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..