Share News

Sadabainama : గుడ్ న్యూస్, సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్

ABN , Publish Date - Sep 10 , 2025 | 09:52 PM

సాదా బైనామా భూములున్న తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ భూముల క్రమబద్ధీకరణకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. 12-10-2020 నుంచి 10-11-2020 మధ్యకాలంలో దరఖాస్తు చేసుకున్న..

Sadabainama : గుడ్ న్యూస్, సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్
Sadabainama lands

హైదరాబాద్, సెప్టెంబర్ 10 : సాదా బైనామా భూములున్న తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సాదాబైనామ కింద దరఖాస్తు చేసుకున్న భూముల క్రమబద్ధీకరణకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. 12-10-2020 నుంచి 10-11-2020 మధ్యకాలంలో దరఖాస్తు చేసుకున్న సాదాబైనామ భూములను క్రమబద్ధీకరించనుంది. 26-08-2025న రాష్ట్ర హై కోర్ట్ ఇచ్చిన ఆదేశాలమేరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ సర్కారు.


ఈ పథకం కింద, గరిష్టంగా 5 ఎకరాల వరకు కేవలం కాగితాలపై నమోదైన భూములను క్రమబద్దీకరించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, 2 జూన్ 2014కు ముందు జరిగిన సాదాబైనామ లావాదేవీలు ఈ క్రమబద్ధీకరణకు వీలవుతాయి. ఈ పథకం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA), కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలలోని భూములకు వర్తించదు. కానీ, నిర్దిష్ట నోటిఫైడ్ మండలాలు మినహాయిస్తారు.


చిన్న, సన్నకారు రైతులకు 5 ఎకరాల వరకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే 5 ఎకరాలకు మించిన భూములకు ఈ రుసుములు చెల్లించాలి.ఈ కార్యక్రమం ద్వారా రైతులకు భూమి యాజమాన్య హక్కులను చట్టబద్ధం చేయడం, పట్టాదార్ పాస్‌బుక్‌లు జారీ చేయడం జరుగుతుంది. ఈ పథకం గ్రామీణ రైతులకు తమ భూములను చట్టబద్ధం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. తద్వారా వారు రైత్వారీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను భూ యజమానులు పొందవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

పూర్వ జన్మ సుకృతం.. అందుకే..

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 10:00 PM