Share News

TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు

ABN , Publish Date - May 11 , 2025 | 10:34 AM

TG EAPCET: హైదరాబాద్: తెలంగాణ ఎప్‌సెట్ (EAPCET) ఫలితాలు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారు.

TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు
TG EAPCET Results

హైదరాబాద్: తెలంగాణ ఎప్‌సెట్ (EAPCET) ఫలితాలు (Results) ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫలితాలను విడుదల చేస్తారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. అలాగే విద్యార్థులు సాధించిన ర్యాంకులు (Ranks), మార్కుల (Marks) జాబితాను కూడా వెబ్ సైట్‌లో అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఎప్‌సెట్‌కు హాజరయ్యారు.

Also Read: వీరజవాన్ మురళీ నాయక్‌కు లోకేష్ నివాళి


టీజీ ఈఏపీసెట్‌ ఫలితాలతో పాటు తెలంగాణ ఈఏపీసెట్‌ కౌన్సిలింగ్‌ తేదీలను కూడా ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in/ చూడొచ్చు. రిజల్ట్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. విద్యార్థులు ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఇంజినీరింగ్‌ విభాగం, అగ్రికల్చర్‌ ఫార్మా విభాగం ఆన్సర్‌ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

మోహినీ అలంకరణలో చిన్న వెంకన్న..

పాకిస్తాన్ వక్రబుద్ధి.. నమ్మక ద్రోహం...

For More AP News and Telugu News

Updated Date - May 11 , 2025 | 10:34 AM