Share News

CM Revanth Reddy: అప్రమత్తంగా ఉండండి: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

ABN , Publish Date - Jul 18 , 2025 | 09:27 PM

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో భారీ వర్ష ప్రభావ రిత్యా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ , విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో..

CM Revanth Reddy: అప్రమత్తంగా ఉండండి: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Hyderabad Rains

హైదరాబాద్, జులై 18: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో భారీ వర్ష ప్రభావ రిత్యా అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ , విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

Hyderabad-1.jpg


ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 09:28 PM