Telangana BC Reservations: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం.. స్పందించిన రాజ్‌భవన్..
ABN , Publish Date - Sep 11 , 2025 | 02:58 PM
గత కొన్ని గంటలుగా తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యిందని.. సోషల్ మీడియా, ప్రముఖ టీవీ ఛానల్స్‌లో ప్రచారం అయ్యింది. అయితే ఈ వార్తలను రాజ్ భవన్ కొట్టిపారేసింది.
హైదరాబాద్: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన న్యూస్ అవాస్తవమని రాజ్‌భవన్ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో.. విలీనం చేస్తూ.. జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొందని వివరించారు.
అయితే.. గత కొన్ని గంటలుగా.. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యిందని.. సోషల్ మీడియాలో, ప్రముఖ టీవీ ఛానల్స్‌లో ప్రచారం అయ్యింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు, 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ మేరకు స్పందించిన రాజ్‌భవన్ అధికారులు ఇదంతా అవాస్తవమని తేల్చి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి
భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు