Rain Expected Shortly: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరికాసేపట్లో వర్షం..
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:51 PM
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ ఖాతా పేర్కొంది. ఈ రోజు నుంచి ఉత్తర తెలంగాణలో వాతావరణం మరింత చల్లగా మారనుందని తెలిపింది.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మబ్బులు కమ్మేశాయి. వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు చినుకులు పడి ఆగిపోయాయి. దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ ఖాతా పేర్కొంది. ఈ రోజు నుంచి ఉత్తర తెలంగాణలో వాతావరణం మరింత చల్లగా మారనుందని తెలిపింది. ఇప్పటికే చలి వాతావరణంతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలు పెరగనున్న చలితో మరింత ఇబ్బందిపడాల్సి వస్తుంది.
ఏపీలోనూ వర్షం..
తమిళనాడు, కేరళ, కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు (బుధవారం) భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో నాలుగు రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో చలి వాతావరం కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో 4, 5 తేదీల్లో చలి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది. ఉత్తర రాజస్థాన్‌లో 4 నుంచి 6వ తేదీ వరకు, జార్ఖండ్‌లో 6,7 తేదీల్లో చలి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
యాప్ ముందస్తు ఇన్‌స్టలేషన్ తప్పనిసరేం కాదు.. కేంద్రం
గుడ్ న్యూస్.. భూదార్ కార్డులపై కీలక నిర్ణయం