Sanchar Saati: యాప్ ముందస్తు ఇన్‌స్టలేషన్ తప్పనిసరేం కాదు.. కేంద్రం
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:34 PM
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత స్వచ్ఛందంగా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న సంఖ్య ఒక్కరోజులోనే పదింతలు పెరిగిందని డీఓటీ తెలిపింది. 1.4 కోట్ల మంది ఇప్పటికే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని వివరించింది.
న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా తయారు చేసే మొబైల్ ఫోన్లలో 'సంచార్ సాథీ' యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరేమీ కాదని కేంద్రం తెలిపింది. యాప్ ప్రీ-ఇన్‌స్టలేషన్‌ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్టు టెలికమ్యూనికేషన్ల శాఖ (DOT) ప్రకటించింది. యాప్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఇటీవల ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్నట్టు వివరించింది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత స్వచ్ఛందంగా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న సంఖ్య ఒక్కరోజులోనే పదింతలు పెరిగిందని డీఓటీ తెలిపింది. 1.4 కోట్ల మంది ఇప్పటికీ ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని వివరించింది. గడచిన ఒక్క రోజులైనే 6 లక్షల మంది యూప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని తెలిపింది. వినియోగదారుల సంఖ్య శీఘ్రగతిని పెరుగుతోందని చెప్పింది. యాప్‌ను తప్పనిసరి చేయడం వెనుక ఈ ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రజలందరికీ తేలిగ్గా తెలుసుకునే అవకాశం కల్పించడం తమ ఉద్దేశమని డీఓటీ ఆ ప్రకటనలో వివరించింది. సంచార్ సాథీకి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ముందస్తు ఇన్‌స్టలేషన్ తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
సంచార్ సాథీతో సైబర్ ఫ్రాడ్‌ల నుంచి రక్షణ: మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
సంచార్ సాథీతో నిఘాకు తావే లేదు.. లోక్‌సభలో సింధియా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి