Share News

DRDO Rocket Sled Test: విజయవంతంగా హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్.. ఎలైట్ క్లబ్‌లో భారత్

ABN , Publish Date - Dec 03 , 2025 | 02:10 PM

యుద్ధ సమయంలో భారత యుద్ధ విమాన పైలట్లు ఇకపై ఆకాశంలో ఎంత ఎత్తుకెళ్లినా వారి ప్రాణాలకి ఢోకా లేదు. ఈ సాంకేతిక కోసం ఇప్పటి వరకూ విదేశాలపై ఆధారపడిన భారత్.. ఇక స్వయంగా తన పైలట్లను రక్షించుకోగలదు. దీనికి సంబంధించి చేసిన టెస్ట్ విజయవంతమైంది.

DRDO Rocket Sled Test: విజయవంతంగా హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్.. ఎలైట్ క్లబ్‌లో భారత్
DRDO Rocket Sled Test

చండీగఢ్, డిసెంబర్ 3, 2025: రక్షణ సాంకేతికతల్లో భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్‌పై హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది.


ఇది.. భారత్‌ను ప్రపంచంలోని 'ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్ టెస్టింగ్' ఎలైట్ క్లబ్‌లోకి తీసుకెళ్లిన ఘనత సాధించింది. ఈ క్లబ్‌లో ఇప్పటివరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఐదవ దేశంగా మారింది.


ఈ విజయం భారత రక్షణ వ్యవస్థకు భద్రతనిస్తుంది. ఎమర్జెన్సీలో యుద్ధ విమానం నుంచి పైలట్‌ను సురక్షితంగా బయటకు పంపుతుంది. దీని ద్వారా భారత పైలట్లకు ప్రపంచంలోనే అత్యుత్తమ రక్షణ హామీ లభిస్తుంది.


కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయాన్ని ప్రశంసిస్తూ, 'భారత్‌కు డిఫెన్స్ కెపాబిలిటీలో ఇది మరో మైలురాయి. డిఫెన్స్ R&D విభాగం, DRDO, IAF, ADA, HALలను అభినందిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. DRDO చైర్మన్ సమీర్ వి. కామత్ కూడా టీమ్‌ను అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?

పట్టుబట్టి.. మంజూరు చేయించి...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2025 | 02:53 PM