Share News

Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు తీర్పు ఇదే..

ABN , Publish Date - Feb 03 , 2025 | 08:28 PM

హైదరాబాద్: గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నేడు(సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది.

Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు తీర్పు ఇదే..
Supreme Court

హైదరాబాద్: గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నేడు(సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది. దీంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది. గతంలో గ్రూప్-1 నియామకాలకు సంబంధించి పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో టీజీపీఎస్సీ త్వరలో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు ఇవే కావడం విశేషం.


కాగా, తెలంగాణలో గ్రూపు-1 మెయిన్‌ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకూ జరిగిన సంగతి తెలిసిందే. మెుత్తం 563 పోస్టులకు గానూ 31,403 (క్రీడల కోటా కలిసి) మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. అయితే జీవో 29ను రద్దు చేయాలని, గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. రాజకీయ పార్టీలు సైతం వారికి మద్దతు తెలపడంతో ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. హైదరాబాద్ నగరంలో లాఠీ ఛార్జ్ సైతం జరిగింది. పెద్దఎత్తున నిరసన తెలిపిన అభ్యర్థులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. పరీక్షలు మెుదలైన రోజే కేసు విచారణకు రావడంతో పరీక్షలు నిలిపివేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అయితే నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం అభ్యర్థుల పిటిషన్లు కొట్టివేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Manchu Family: మేజిస్ట్రేట్ ముందు తిట్టుకొన్న మోహన్ బాబు, మనోజ్

Masthan Sai: లావణ్య, రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి 200కుపైగా వీడియోలు

Updated Date - Feb 03 , 2025 | 08:50 PM