Share News

Sigachi Incident Missing Victims: సిగాచి దుర్ఘటన.. ఇంటర్వ్యూకు వచ్చిన యువతి అదృశ్యం

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:49 PM

Sigachi Incident Missing Victims: సిగాచి పరిశ్రమ వద్ద గల్లంతైన వారి కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఇప్పటికి తమ వారి ఆచూకీ చెప్పడం లేదంటూ ఆందోళనకు దిగారు.

Sigachi Incident Missing Victims:  సిగాచి దుర్ఘటన.. ఇంటర్వ్యూకు వచ్చిన యువతి అదృశ్యం
Sigachi Incident Missing Victims

హైదరాబాద్, జులై 3: పాశమైలారంలో సిగాచి పరిశ్రమ (Sigachi Incident) వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే సిగాచి పరిశ్రమలో ఇంకా పది మంది ఆచూకి లభించలేదు. ఇదిలా ఉండగా.. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన టైంలో ఇంటర్వ్యూ‌కు వచ్చిన ఓ యువతి గల్లంతైంది. సోమవారం (జూన్ 30) ఉదయాన్నే ఓ యువతి సిగాచి కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చింది. ఆమె హెచ్ఆర్ ఛాంబర్‌కు వెళ్లిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని ఇతర కార్మికులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ యువతి జాడ తెలియని పరిస్థితి. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై కూడా స్పష్టత లేదు. శిథిలాలను తొలగిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మరోవైపు సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్యపై కూడా సరైన క్లారిటీ లేదు. మొదట 40 అని చెప్పి తరువాత 38 మంది చెందినట్లు ప్రకటించారు. మరో 35 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇక సిగాచి పరిశ్రమ వద్ద గల్లంతైన వారి కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఇప్పటికి తమ వారి ఆచూకీ చెప్పడం లేదంటూ ఆందోళనకు దిగారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కుమారుడి కోసం తండ్రి ఆవేదన

కాగా.. కుమారుడి జస్టిన్ ఆచూకీ తెలియలేదు అంటూ తండ్రి రాందాస్ కన్నీరు పర్యంతమయ్యారు. మర్క్స్ నగర్‌కు చెందిన జస్టిన్ (22) ఆచూకీ తెలపడం లేదంటూ కుటుంబీకులు, బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళనను అడ్డగించిన పోలీసులు... వారిని పరిశ్రమ నుంచి పంపించేందుకు యత్నించారు. దీంతో జస్టిన్ తండ్రి రాయితో తలబాదుకుని రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. రాయితో తలపై గాయం చేసుకున్న రాందాస్‌కు వైద్యులు చికిత్స అందించారు. రాందాస్‌కు పోలీసు, ఇతర విభాగ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సిగాచి పరిశ్రమ వద్దకు ఎక్స్పర్ట్ కమిటీ రాకతో పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


మీడియాపై ఆంక్షలు

సిగాచి పరిశ్రమ వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. పరిశ్రమ వద్ద నుంచి మీడియాను బలవంతంగా దూరంగా పంపించారు పోలీసులు. బాధిత కుటుంబాల ఆందోళనను కవర్ చేస్తున్నారనే కారణంతో మీడియాను పోలీసులు బయటకు పంపించినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్

వరంగల్ ఇష్యూ.. మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 03 , 2025 | 12:51 PM