Share News

Sex Racket: వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు..

ABN , Publish Date - May 05 , 2025 | 09:47 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏజెంట్, నిర్వాహకుడు నాయక్‌లను అరెస్టు చేశారు. ఇద్దరు విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sex Racket: వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు..
Sex Racket in Hyderabad

హైదరాబాద్: జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో ‘బూమ్ బూమ్’ (Boom Boom) పేరుతో ఓ ప్లాట్‌లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. విశ్వాసనీయ సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు (Police) దాడులు చేశారు. థాయిలాండ్ (Thailand) యువతితో పాటు బంగ్లాదేశ్ (Bangladesh) యువతి చేత ఓ ముఠా వ్యభిచారం (Sex trafficking) చేయిస్తోంది. ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సర్వీస్ అపార్ట్ మెంట్ కేంద్రంగా సెక్స్ రాకెట్ నడుపుతోంది. థాయ్ లాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నారు. ‘బూమ్ బూమ్‘ పేరుతో నాయక్ అనే నిర్వాహకుడు కస్టమర్లకు వల వేస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో జరిపిన దాడిలో ఇద్దరు విదేశీ యువతులు పట్టుబడ్డారు.


గత డిసెంబర్‌లో బంగ్లాదేశ్ యువతి (23) అక్రమంగా సరిహద్దు దాటి వచ్చింది. అలాగే థాయ్ లాండ్ యువతి (30) ట్రావెల్ వీసాతో స్నేహితుడి కోసం వచ్చి చెన్నై మీదుగా హైదరాబాద్‌కు వచ్చింది. బ్యాంకాక్‌లోని వ్యభిచార నిర్వాహకురాలి సూచనలతో నాయక్ అనే వ్యక్తి నడిపించే బ్రోతల్ హౌస్‌లో ఆమె వ్యభిచారం చేస్తోంది. దీంతో బంగ్లాదేశ్ నుంచి యువతిని తెచ్చిన ఏజెంట్.. థాయ్ లాండ్ మహిళ, బ్రోతల్ హౌస్ నిర్వాహకుల మీద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు..


ఏజెంట్, నిర్వాహకుడు నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం నేరమని, చట్ట విరుద్ధమైన పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నాయక్‌ను రిమాండ్ తరలించనున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై తమకు ధైర్యంగా సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త

రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు..

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 09:52 AM