Share News

Saudi Bus Accident: సౌదీ ప్రమాదం... రెండు కుటుంబాల్లోని వారంతా

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:32 AM

సౌదీ రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ఎనిమిది మందిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో కుటుంబంలోని ఏడుగురు చనిపోయారు.

Saudi Bus Accident: సౌదీ ప్రమాదం... రెండు కుటుంబాల్లోని వారంతా
Saudi Bus Accident

హైదరాబాద్, నవంబర్ 17: సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Saudi Bus Accident) 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హైదరాబాద్‌ వాసులు ఎక్కువగా ఉన్నారు. బస్సు - డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు. ఎనిమిది మందిలో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు.


చనిపోయిన ఏడుగురి వివరాలు..

మహమ్మద్ అబ్దుల్ కధీర్ (షోయబ్ ఫాదర్)

గౌసియా బేగం (షోయబ్ మదర్)

మహమ్మద్ మౌలానా.. (గౌసియా ఫాదర్)

రహీమ్ ఉనిషా

రెహమత్ బి..

మహమ్మద్ మన్సూర్ (బంధువులు)

వీరితో పాటు మరొకరు ఉన్నారు.


అలాగే మరో కుటుంబానికి చెందిన ఏడుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారికి సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో చనిపోయినట్టుగా కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఘటన జరిగిన దగ్గర నుంచి ఆ ఏడుగురు అందుబాటులో లేకుండా పోయారు. నవంబర్ 9న ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లై జోన్ నుంచి మరో 24 మంది మక్కాకు బయలుదేరి వెళ్లారు. మక్కాలో దర్శనం తర్వాత మదీనాకు 40 మంది బయలుదేరగా.. నలుగురు మాత్రం మక్కాలోనే ఉండిపోయారు. ఇక ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా మిగిలిన 39 మంది చనిపోయినట్లుగా కుటుంబసభ్యులు భావిస్తున్నారు.


తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

సౌదీలో ఘోర బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో సమాచారం కొరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్లు ఇవే..

  • పీఎస్ నుంచి రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్ వందన : +91 98719 99044

  • పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిహెచ్. చక్రవర్తి : +91 99583 22143

  • లైజన్ ఆఫీసర్ రక్షిత్ నైల్: +91 96437 23157


ఇవి కూడా చదవండి

ఘోర రోడ్డు ప్రమాదం.. సౌదీలో 42 మంది భారతీయులు మృతి..

సౌదీ అరేబియా ఘటన.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించండి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 17 , 2025 | 12:27 PM