Retired IAS RP Singh: పోలీసుల అదుపులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:29 PM
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్‌పై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆర్పీ సింగ్‌ను సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
హైదరాబాద్, జులై 16: భూ వివాదం నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సీసీఎస్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు తరలించి.. విచారిస్తున్నారు. ఖాజాగుడాలోని సర్వే నెంబర్ 19 లోని 10. 32 గుంటల భూమికి తాము యజమానులమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్, ఆయన భార్య హర్వీందర్ సింగ్ స్పష్టం చేశారు. ఆ క్రమంలో సదరు స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఐ టవర్ నిర్మాణ సంస్థతో ఆర్పీ సింగ్ ఒప్పందం చేసుకున్నారు.
అందులో 3 ఎకరాల 24 గంటల భూమి గిఫ్ట్ డీడ్‌గా ఉన్నట్లు ఐ టవర్ నిర్మాణ సంస్థ గుర్తించింది. ఇదే విషయాన్ని ఆర్పీ సింగ్ దంపతుల దృష్టికి ఐ టవర్ నిర్మాణ సంస్థ తీసుకు వెళ్లింది. దీంతో తన కుమార్తె అమెరికాలో ఉందని వారు పేర్కొంటూ.. ఆ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఐ టవర్ నిర్మాణ సంస్థకు, ఆర్పీ సింగ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి.
ఈ విషయాన్ని దాచి పెట్టి సదరు స్థలాన్ని డెవలప్‌మెంట్‌కు ఇచ్చారంటూ ఆర్పీ సింగ్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఐ టవర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే లోన్ కోసం ఐ టవర్ నిర్మాణ సంస్థ బ్యాంకు వెళ్లడంతో ఈ విషయం బహిర్గమైంది.
దాంతో గిఫ్ట్ డీడ్ వ్యవహారాన్ని ఆర్పీ సింగ్‌ని సంస్థ యాజమాన్యం నిలదీసి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కావడంతో అందులోని ప్లాట్లను ఇప్పటికే పలువురు కస్టమర్లు కొనుగోలు చేశారు. బ్యాంక్ లోన్ రాకపోవడం, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ పూర్తి కాకపోవడంతో దాదాపు 700 మంది కొనుగోలు దారులు బాధితులుగా మారారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై బీసీల గురి..!
మల్నాడు డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు
Read Latest Telangana News And Telugu News