Share News

I Bomma Ravi: ఐ బొమ్మ రవి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..

ABN , Publish Date - Nov 16 , 2025 | 09:05 PM

ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రవి నుంచి ఆమె దూరంగా వెళ్లిపోయింది.

I Bomma Ravi: ఐ బొమ్మ రవి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..

హైదరాబాద్, నవంబర్ 16: ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని వేల సినిమాలను హార్డ్ డిస్క్‌లో రవి భద్రపరిచినట్లు పోలీసులు గుర్తించారు. డిలీట్ అయినా సరే బ్యాకప్ లో వేల సినిమాలను హార్ట్ డిస్కుల్లో అతడు ఉంచినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నం కాగా.. అతడు ముంబైలో ఎంబీఏ పూర్తి చేసినట్లు విచారణలో వెల్లడైంది. ముస్లిం యువతిని రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు భార్యతో విడిపోయాడు.


2018 నుంచి హైదరాబాద్ కూకట్ పల్లిలోని రెయిన్ బో విస్టాలో రవి నివాసం ఉంటున్నాడు. తొలుత ప్యామిలీతో ఉన్న అతడు.. ఆ తర్వాత ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే కమ్యూనిటీ వాసులు అడిగితే.. తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు చెప్పేవాడని తెలుస్తోంది. ఓ బెట్టింగ్ యాప్, ఈఆర్ ఇన్ఫోటెక్‌లకు అతడు సీఈవోగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.


మరోవైపు రెయిన్‌బో విస్టా నుంచి ఇతర దేశాలకు ఐపీ అడ్రస్‌ను రవి మార్చుకుంటూ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బ్రిటన్‌లో ఏకంగా ఒక టీంను రవి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని వేల సినిమాలను తన టీంతో కలిసి సర్వర్ల ద్వారా రవి హ్యాక్ చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. గ్లోబల్‌ వ్యాప్తంగా పెద్ద నెట్ వర్క్‌ను ఇమ్మడి రవి నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్‌ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..

KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్‌.. రేపు విచారణ

Updated Date - Nov 16 , 2025 | 09:34 PM