Share News

KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్‌.. రేపు విచారణ

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:16 PM

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్‌.. రేపు విచారణ
KTR

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రాబోతోంది (KTR petition Supreme Court).


గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మూడు నెలల గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు (TS Speaker case). ఎమ్మెల్యేలపై విచారణకు సంబంధించి తమకు మరింత గడువు కావాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం సైతం ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ పిటిషన్‌తో పాటు స్పీకర్ కార్యాలయం వేసిన అదనపు పిటిషన్‌పై కూడా సోమవారం విచారణ జరగడం ఖాయమైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్‌.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..

షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 16 , 2025 | 01:16 PM