Ibomma And Bappam Websites Block: షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..
ABN , Publish Date - Nov 16 , 2025 | 09:12 AM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐ బొమ్మ, బప్పం వెబ్‌సైట్‌లను బ్లాక్ చేశారు. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Hyderabad Cyber Crime Police) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐ బొమ్మ (Ibomma), బప్పం (Bappam) వెబ్‌సైట్‌లను బ్లాక్ చేశారు.
కాగా, ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నిన్న(శనివారం) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులకు దమ్ముంటే తనను పట్టుకోవాలని కొన్ని రోజుల ముందు సవాల్ చేశారు ఇమ్మడి రవి. ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు నిన్న(శనివారం) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మేజిస్ట్రేట్ ఇంట్లో రవిని హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఏడు రోజుల వరకు కస్టడీకి రవిని ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు పోలీసులు.
రవిపై పోలీసుల ఫోకస్..
రవిపై ఎప్పటి నుంచో ఫోకస్ చేశారు పోలీసులు. నిన్న ఆమ్‌స్టర్‌డమ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు రవి. కూకట్‌పల్లి రెయిన్‌బో విస్టాలో ఆయన నివాసం ఉంటున్నారు. నేరుగా కూకట్‌పల్లి వెళ్లి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో పైరసీ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదేళ్ల క్రితమే రవి తన భార్యతో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఖాతాలోని రూ.2.5 కోట్లని ఫ్రీజ్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ లింక్ ద్వారా రవి దొరికారు.
1XBet ద్వారా బెట్టింగ్ ప్రమోషన్లు..
ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో 1XBet ద్వారా బెట్టింగ్ ప్రమోషన్‌లకు రవి తెరదీశారు. ఐ బొమ్మలో ఒక వైపు సినిమా ప్లే అవుతుంటే... మరోవైపు ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ ప్రకటనలు ఉంచారు. సినిమాల కోసం ఐ బొమ్మ వైబ్‌సైట్ చూసే వారిని బెట్టింగ్ వైపు దారి మళ్లించేలా ప్రకటనలు ప్రదర్శించారు. తద్వారా బెట్టింగ్ కంపెనీల నుంచి ఐ బొమ్మ రవికి నిధులు వచ్చేవని పోలీసులు తెలిపారు. 1Xbet బెట్టింగ్ లింక్‌లను ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు ఐబొమ్మ లింక్ ద్వారా రవి దొరికారు. 1Xbet బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, రవి మధ్య భారీ స్థాయిలోనే లావాదేవీలు నడిచినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. రవిని ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News and National News