Prime Minister Economic Advisory Council Chairman Mahendra Dev meets CM Revanth Reddy in Hyderabad avn
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:12 PM
సీఎం రేవంత్ రెడ్డిని ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్ ఎస్.మహేంద్ర దేవ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఇంకా..
హైదరాబాద్, జులై 12: సీఎం రేవంత్ రెడ్డిని ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్ ఎస్.మహేంద్ర దేవ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అంశంపై ఇరువురి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవా రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఫోన్ దొంగతనం.. కట్ చేస్తే భార్య ఎఫైర్ బయటపడింది..
వీధి కుక్కలకు మహర్దశ.. 2 కోట్లతో కొత్త స్కీమ్..