PM Modi Condolence Ande Sri: అందెశ్రీ మృతి మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు: ప్రధాని
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:44 PM
ప్రముఖ కవి అందెశ్రీ హఠాన్మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. అందెశ్రీ పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉందన్నారు.
హైదరాబాద్/న్యూఢిల్లీ, నవంబర్ 10: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Andr Sri) మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సంతాపం తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని స్పందిస్తూ.. అందెశ్రీ మృతి మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటన్నారు. ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు అందెశ్రీ గొంతుకగా నిలిచారని అన్నారు. అందెశ్రీ కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
మోడీ ట్వీట్
‘అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు , అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి, ప్రజల సాంఘిక హృదయస్పందనకు రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అంటూ ప్రధాన మోడీ తెలుగులో ట్వీట్ చేశారు.
కాగా.. ప్రముఖ కవి అందెశ్రీ ఈరోజు (సోమవారం) ఉదయం కన్నుమూశారు. ఇంట్లో కుప్పకూలి పడిపోయిన ఆయనను కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా.. ఆయన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అందెశ్రీ మృతిపట్ల రాజకీయ నేతలు, సాహితీ వేత్తలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు సంతాపం తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్
Read Latest Telangana News And Telugu News