Andesri Passes Away: అందెశ్రీ మృతిపై సంచలన ప్రకటన
ABN , Publish Date - Nov 10 , 2025 | 10:09 AM
ప్రముఖ కవి అందెశ్రీ మృతిపై గాంధీ వైద్యులు సంచలన ప్రకటన చేశారు. ఆరోగ్యం విషయంలో అందెశ్రీ నిర్లక్ష్యం చేశారని.. నెల రోజులుగా బీపీ మాత్రలు వేసుకోలేదని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 10: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. ఈరోజు (సోమవారం) ఉదయం ఇంట్లో కుప్పకూలి పడిపోయిన అందెశ్రీని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా... అందెశ్రీ మృతిపై గాంధీ వైద్యులు సంచలన ప్రకటన చేశారు. హార్ట్‌స్ట్రోక్ వల్లే ఆయన చనిపోయారని.. కానీ గత కొద్దిరోజులుగా ఆయన మందులు వాడటం లేదని గాంధీ ఆస్పత్రి హెచ్‌ఓడీ జనరల్ సునీల్ కుమార్ తెలిపారు.
ఈరోజు ఉదయం 7:30 గంటలకు అందెశ్రీని కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారని సునీల్ కుమార్ తెలిపారు. బ్రాట్ డెడ్‌గా వైద్యులు డిక్లేర్ చేసినట్లు చెప్పారు. హార్ట్‌స్ట్రోక్ వల్లే అందెశ్రీ చనిపోయినట్లు వెల్లడించారు. అందెశ్రీకి గత ఐదేళ్లుగా హైపర్ టెన్షన్ ఉందని... అయితే ఒక నెలరోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదని తెలిపారు. ఆయనకు ఆయాసం ఉందని, చెస్ట్ డిస్‌కంఫర్టబుల్ ఉందన్నారు. ఆరోగ్య విషయంలో అందెశ్రీ నిర్లక్ష్యం చేసినట్లు చెప్పారు. గత రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్నారని తెలిపారు.
ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్ రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నారని అన్నారు. రాత్రి ఏం జరిగిందో తెలియదని.. ఉదయం కుటుంబ సభ్యులు అందెశ్రీని గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు హెచ్‌ఓడీ జనరల్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. అందెశ్రీ చనిపోయారని గాంధీ ఆస్పత్రిలో ఆర్‌ఎంవో డిక్లేర్ చేశారని డాక్టర్ సింధూర తెలిపారు. ఆయన చనిపోయి ఐదు గంటలు అయి ఉండొచ్చన్నారు. మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆయన వైద్యున్ని సంప్రదించలేదని, నెల రోజుల నుంచి బీపీ మాత్రలు వేసుకోలేదని డాక్టర్ సింధూర వెల్లడించారు.
మరోవైపు అందెశ్రీ మృతిపట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్, తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. అందెశ్రీకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
కార్తీక మాసం మూడో సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
డిసెంబర్ 6న డాలస్‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. సభ కోసం భారీ ప్లానింగ్
Read Latest Telangana News And Telugu News