Share News

BRS MLA's Protests: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. బస్సు ఛార్టీలు తగ్గించాలని డిమాండ్

ABN , Publish Date - Oct 07 , 2025 | 08:53 AM

టీజీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు పేర్కొంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎస్ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో ఛార్జీల పెంచుతున్నట్లు చెప్పింది.

BRS MLA's Protests: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. బస్సు ఛార్టీలు తగ్గించాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్సు ఛార్జీలను పెంచాటాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిటీ ఎమ్మెల్యేలు నిరసన దిగారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ బస్‌స్టాప్ నుంచి అసెంబ్లీ బస్‌స్టాప్ వరకు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉచిత పథకాలు అని అందజేస్తూ.. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోపిడి చేస్తోందని ఆరోపించారు.


టీజీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు పేర్కొంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎస్ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో ఛార్జీల పెంచుతున్నట్లు చెప్పింది. మొదటి మూడు స్టేజిలకు రూ.5, 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు ఛార్జీల వసూలు చేయనున్నట్లు సమాచారం. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. అయితే.. పెరిగిన ఛార్జీలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు.


Also Read:

ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. 3 తేడాలు కనిపెట్టండి..

Updated Date - Oct 07 , 2025 | 01:59 PM